వాణిజ్యపంటలకు మనదేశంలో కొదువ లేదు. మనదేశ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వాణిజ్య పంటలతో పాటు, ఉప్పులు, పప్పులు పండుతాయి. నూనెగింజలు పండుతాయి. అందులో పసుపు, మిర్చి, పత్తి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, వేరుశనగ, నువ్వులు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పాలు రకరకాల వరి ధాన్యం కూడా పండుతుంది. మన నేలలో ఈ పంటలకు అనువుగా ఉన్నాయి. నేలలకు అనువుగా మనకు నదులు, సరస్సులు ఉన్నాయి. కష్టపడి పండించేందుకు అన్నదాతులు సిద్దంగా ఉన్నారు. లేనిదల్లా ప్రోత్సాహం ఒక్కటే. అయినా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తిందామంటే తిండిదొరకని ఎన్నో కుటుంబాలను చూస్తున్నాం. దేశంలో పండుతున్న పంటను ప్రోత్సహించి, ప్రజలకు తిండిగింజల కొరత లేకుండా చేయడం ఒక ఎత్తు. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించి విదేశాలకు ఎగుమతులు చేయడం మరో ఎత్తు. ఇలా ఒక్క వ్యవసాయంతోనే మన దేశ దరిద్రం తీరుతుంది. భూములు, వనరులు, మానవ వనరులు ఉన్నా ఉపయోగించే న్కెపుణ్యం ప్రభుత్వాలకు ఉండడం లేదు. అందుకే దేశీయంగా పంటలను ప్రోత్సహించడం లేదు. గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు. దీనికితోడు అసవరమున్నా లేకున్నా అన్నీ దిగుమతి చేసుకునేం దుకు అలవాటు పడ్డాం.
ఈ క్రమంలో దేశీయంగా పసుపు, మిర్చి, పత్తి పంటలు విపరీతంగా పండుతున్నా ధరలు లేక రైతులు దిగాలు పడుతున్నారు. ప్రజలేమో ధరలు పెట్టి కొనలేక బాధపడుతున్నారు. ఈ వ్యత్యాసాన్ని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. పసుపు రెండు వేల సంవత్సరాలుగా ఒక అద్భుత ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దకంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. భారతదేశంలో పసుపు లేని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పసుపుతో పాటు మిర్చి, అల్లం వెల్లుల్లి కూడా వాణిజ్య స్థాయిలో పండించే సత్తా మన రైతులకు ఉంది. అలాంటి పసుపుకు బోర్డు కోసం రైతులు ఏళ్లుగా పోరాడాల్సి వచ్చింది. రైతు తలచుకుంటే పంట పండించడమే కాదు, పంటకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే బోర్డు ఎలా సాధించుకోవాలో కూడా తెలుసు. పసుపు బోర్డు సాధించి చూపించిన నిజామాబాద్ రైతులు దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలిచారు. పసుపు బోర్డు కోసం 2006లో మొదల్కెన పోరాటం 2 దశాబ్దాలుగా అలుపెరగకుండా సాగింది.
ఇకపోతే పంజాబ్, హర్యానా రైతులు కూడా పంటల గిట్టుబాటు ధరల కోసం ఏళ్లుగా పోరాడుతున్నారు. వారి వెనక రాజకీయ కోణాలు ఉన్నాయన్న విషయాన్ని పక్కన పెట్టి వారితో చర్చించి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ది ప్రకటించడం లేదు. ఇకపోతే తెలంగాణలో పసుసు బోర్డు ఏర్పాటయ్యింది కనుక ఇక వారి కష్టాలు గట్టెక్కాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేసుకోవడం ఓ రకంగా రైతుల విజయానికి నాంది అనుకోవాలి. పసుపు బోర్డు సాధనలో వారు చూపిన తెగువ ఎనలేనిది. 2019 లోకసభ ఎన్నికల్లో 178 మంది పసుపు రైతులు నిజామాబాద్ ఎంపీ గా పోటీచేయడానికి నామినేషన్ వేయడం. వీరికోసం ఏకంగా ఒక్కో బూత్‌లో 12 ఈవీఎం మిషన్లు వాడాల్సి రావండ వంటివన్నీ జాతీయస్థాయిలో సమస్యను చాటాయి. వీరు దాదాపు లక్ష వోట్లు పొందడం ఆ ప్రాంతంలో పసుపు బోర్డు డిమాండ్ ఎంత బలంగా ఉందో అనడానికి నిదర్శనంగగా నిలిచింది. అంతే కాకుండా వారణాశిలో 30 మంది పసుపు రైతులు నామినేషన్ వేసి మోదీపై పోటీకి దిగారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా దాదాపు 27 మంది రైతులు పోటీచేశారు. పొలాల్లో పంటలు పండించడమే కాదు, రాజకీయ చతురత కూడా ప్రదర్శించగలమని రైతన్నలు నిరూపిం చారు. అయితే రైతులు పోరాటాలుచేస్తే తప్ప సమస్యలు గుర్తించకుండా ప్రభుత్వాలు కల్లబొల్లి కబుర్లు చెబుతు న్నాయి. ఇదే తరహాలో మిర్చి బోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది.
నిజానికి రైతుల ఆకాంక్షల మేరకు బోర్టులు ఏర్పాటు చేయడం లేదా…పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ప్రోత్సహించడం, ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వాల విధి. ఒక బోర్డుల ఏర్పాటును పరిశీలిస్తే…కాఫీ ఉత్పత్తులు పెంచడానికి 1942లో బెంగళూరు కేంద్రంగా కాఫీ బోర్డును స్థాపించారు. రబ్బరులో శాస్త్రీయ, సాంకేతిక, ఆర్థిక పరిశోధనలు, మార్కెటింగ్‌ను ప్రోత్సహించడానికి 1947లో కేరళలోని కొట్టాయంలో రబ్బర్ బోర్డును స్థాపించారు. టీ ఉత్పత్తి, ఎగుమతులు పెంచడానికి 1954లో కోల్‌కత్తాలో టీ బోర్డును స్థాపించారు. టొబాకో ఎగుమతులు పెంచడానికి 1976లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో టొబాకో బోర్డు స్థాపించారు. కొబ్బరి ఉత్పాదకత పెరుగుదల, ఉత్పత్తుల వైవిధ్యీకరణపై దృష్టి సారించి దేశంలో కొబ్బరి ఉత్పత్తి, వినియోగం కోసం సమగ్ర అభివృద్ధి కోసం కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డును 1981లో కేరళలోని కొచ్చిన్ లో స్థాపించారు. ఇలా పంటల దిగుబడిని పెంచి, రైతులకు లాభాలు చేకూర్చడంతో పాటు, ఎగుమతుల ద్వారా ఆదా యం పెంచడం లక్ష్యంగా ఆయా బోర్డులను పెంచారు.
అలాగే ఆయ పంటల ఉత్పత్తులపైనా ఇప్పుడు దృష్టి సారిం చాల్సి ఉంది. రైతులకు లాభం చేకూర్చేలా ఎగుమతులకు అనుకూల పరిస్థితులు సృష్టించడం, పంట నాణ్యతను మెరుగుపర్చడం, కొత్త వంగడాల అభివృద్ధి కోసం పరిశోధనలు నిర్వహించి సలహాలు అందించడం, పంట విస్తీర్ణాన్ని పెంచడం, అధిక దిగుబడుల కోసం కృషి చేయడం అవసరం. పసుపు సాగు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం, పసుపు రైతుల ఆదా యాన్ని పెంచడంతోపాటు పసుపు ఔషధ ప్రయోజనాలపై అవగాహన పెంచడం కోసం తాజాగా పసుపు బోర్డు ఏర్పాటు అయ్యింది. ఈ బోర్డు ద్వారా రైతులకు పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్క్రె చేయడం, పాలిష్ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందించడం జరుగుతుంది. పసుపు పంట విత్తిన తరువాత అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం, నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందిస్తుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. పసుపు పండిస్తున్న 20 రాష్ట్రాల రైతులకు ప్రత్యేక లాభం చేకూరనున్నది.
నిజామబాద్ కేంద్రంగా పసుపు బోర్డుల ఏర్పాట్కెనందున ఇక పసుపును అంతర్జాతీయంగా ఉత్పత్తి చేసి, ఎగుమతులు చేసేలా ప్రోత్సహించాల్సి ఉంది. ఇందుకు బోర్డు కార్యాచరణ కు దిగాలి. పసుపు బోర్డుకి సంబంధించిన ఈ విజయగాథ నిజామాబాద్ రైతుల పోరాట పటిమను, కృషిని, పట్టుదలని ప్రతిబింబిస్తోంది. దేశవ్యాప్తంగా ఇతర రైతులకు కూడా ఇది ఒక ఆదర్శంగా నిలిచింది. నిజామాబాద్‌తోపాటు జగిత్యాల, ఆదిలా బాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పసుపు విరివిగా పండు తుంది. ఎపిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పసుపు పండుతుంది. మన పసుపు ఎక్కువగా బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా, మలేషియాకి ఎగుమతి అవుతున్నది. కాగా, వ్యవసాయ విభాగానికి అందించే సబ్సిడీ నేరుగా రైతులకు చేరాల్సిన అవసరం ఉంది. రైతులు, వ్యవసాయ పరిశ్రమల మధ్య లాభాలను సమానంగా పంచుకోవాలి. రైతులు వ్యవసాయానికి ఖర్చుచేసే ప్రతి రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.గత సంవత్సరం, 2023-24, భారతదేశంలో 3.05 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 10.74 లక్షల టన్నుల ఉత్పత్తితో పసుపు సాగు చేయబడిరది. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 70 శాతం కు పైగా భారతదేశం పండిస్తోంది. మన దేశంలో 30 రకాల పసుపు ఉత్పత్తి అవుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపుఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతి దారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం 62 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2023-24లో, 226.5 మిలియన్ డాలర్లు విలువైన 1.62 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. భారతదేశం నుంచి పసుపు ఎగుమతులు 2030 నాటికి బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా.
ఇకపోతే పసుపుబోర్డుకు ముందు స్పైసెస్ బోర్డు అన్నారు. నిజానికి దీనిని 1987 కేరళలోని కొచ్చిన్ లో 52 సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి స్థాపించారు. పసుపు కూడా స్పైసెస్ బోర్డు పర్యవేక్షణలో ఉండేది. కానీ అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కాబట్టి ప్రత్యేక బోర్డు సాధనకు 2019 లోక్ సభ ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను గెలిపించి, పసుపు రైతుల గళం దిల్లీలో వినిపించాలనుకున్నారు. 2020లో కేంద్రంనిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్ టెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ’ట్రేడ్ ఇన్‌ఫ్రాస్టక్చ్ర ఫర్ ఎక్స్‌పోర్ట్ స్కీమ్’ని అమలుపరుస్తూ పసుపు సాగుకు మౌలిక వసతులు కల్పిస్తూ ఎగుమతులకు పెంపొందించడానికి దోహదపడింది.
కానీ, పసుపు రైతులు ప్రత్యేక బోర్డు కావాలని పట్టుబట్టారు. రైతుల అలుపెరగని పోరాటాన్ని గుర్తించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలమూరు ప్రజాగర్జన సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేశారు. ఇది ఓ విజయమైతే…రైతులు పంటలను పండించి, ఆదాయం పొందితే అంతకుమించిన విజయం ఉండదు. అయితే పంట ఏద్కెనా దేశీయంగా చవకగా లభించి, ఎగుమతుల ద్వారా రైతులకు ఆర్జన చేసి పెట్టేలా పంటల విధానాన్ని ప్రభుత్వాలు అనుసరించాలి. అప్పుడే గ్రావిరీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడగలదు.
– ఎం.వర్ష, హైదరాబాద్





