– సభకు హాజరు కావాలని పార్టీ నాయకులకు మంత్రి పొన్నం పిలుపు
హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు, పట్టణంలో భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనన్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.బు ధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు హు స్నా టబాద్ అక్కన్నపేట రోడ్, స్తూపం వదద్ద సభ ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో పటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




