అంబులెన్సులు ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌8: ‌ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లోని హెచ్‌ఎం‌డీఏ గ్రౌండ్స్‌లో 108, 102 వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభిం చారు. 108 సర్వీసుల కోసం 136 అంబులెన్సులు, 102 సర్వీసుల కోసం 77 అంబులెన్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఇతర మంత్రులు, నేతలతో కలిసి సీఎం పరిశీలించారు.  అనంతరం ఏర్పాటు చేసిన సభలో 28 పారామెడికల్‌, 16 ‌నర్సింగ్‌ ‌కాలేజీలను సీఎం రేవంత్‌ ‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. 33 ట్రాన్స్‌జెండర్ల క్లీనిక్‌లను ప్రారంభించడంతో పాటు 442 మంది సివిల్‌ అసిస్టెంట్‌ ‌సర్జన్లు, 24మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. మైత్రి ట్రాన్స్ ‌క్లీనిక్‌లు ప్రతి గురువారం సేవలందించనున్నాయి. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ నర్సింగ్‌ ‌కళాశాలల సంఖ్య 37కి పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *