– ఆయన తల్లికి నివాళులర్పించిన రేవంత్‌రెడ్డి
నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు ఆర్.భూపతిరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆయన తల్లి లక్ష్మీనరసమ్మ ద్వాదశ దిన కర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో ద్వాదశ దిన కార్యక్రమం జరిగే బోర్గాం శివారులోని కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్నారు. లక్ష్మీనరసమ్మ చిత్ర పటం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎంతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్సాల్ సూర్యనారాయణ, రాకేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





