– పట్టువస్త్రాల సమర్పణ
సికింద్రాబాద్, ప్రజాతంత్ర, జులై 13: సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించారు. సీఎంతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. పొన్నం దంపతులు తొలి బోనం సమర్పించారు. కాగా, బోనాల వేడుకకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణంలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే