న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి దిల్లీలో కలుసుకున్నారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని ఖర్గే అభినందించారు.
భేటీలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలపై ఖర్గేతో సీఎం, పీసీసీ అధ్యక్షుడు చర్చించారు. అంతకుముందు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కూడీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, ఎంపీల బందం కలుసుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




