కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో సీఎం రేవంత్‌ ‌భేటీ

– ఇటీవలి తెలంగాణ రైజింగ్‌ ‌సమ్మిట్‌పై వివరణ
– మెస్సీ ‘ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌11:  ‘‌మెస్సీ గోట్‌ ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ ‌బయలుదేరే ముందు గురువారం పార్లమెంట్‌ ఆవరణలో సీఎం మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న ప్రముఖ ఫుట్‌బాల్‌ ‌క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌ ‌వస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరు అవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నాం. దిల్లీలో కలిసిన అందరినీ ఈ కార్యక్రమానికి రావాలని పిలిచానని తెలిపారు. ఈనెల 13న ఉప్పల్‌ ‌స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ ‌మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ‌క్రీడాకారులు పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌ ‌బిజీబిజీగా గడిపారు. ఉదయం పార్లమెంట్‌లో ఏఐసీసీ అధక్షులు మల్లికార్జునఖర్గేతో పాటు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీతో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, గ్లోబల్‌ ‌సమ్మిట్‌కు సంబంధించిన అంశాలను వారి దృష్టి తీసుకెళ్లారు. గ్లోబల్‌ ‌సమ్మిట్‌ను ఏ విధంగా విజయవంతం చేశామనే అంశాలపై చర్చించారు.  దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్‌తో పాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలు వారితో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సోనియా, రాహుల్‌, ‌ప్రియాంకలకు సీఎం రేవంత్‌ ‌వివరించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన గ్లోబల్‌ ‌సమిట్‌, ‌పెట్టుబడుల వివరాలను సోనియాకు ఆయన వివరించినట్లు తెలిసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *