అ‌శ్రునయనాల మధ్య అందెశ్రీ అంత్యక్రియలు

– పాడె మోసి ప్రేమను చాటుకున్న సీఎం రేవంత్‌
-‌ హాజరైన పలువురు నేతలు, మంత్రులు, కళాకారులు
– పోలీసుల గౌరవ వందనం మధ్య అంత్యక్రియలు పూర్తి
– అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం
– ఆయన పేరు శాశ్వతంగా నిలిచేలా ప్రయత్నిస్తా
– పద్మశ్రీ కోసం గతంలోనే  కేంద్రానికి లేఖ రాశా
– ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 11: అ‌శ్రు నయనాల మధ్య ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు లాలాపేటలోని ఆయ‌న‌ నివాసం నుంచి తార్నాక, ఉప్పల్‌ ‌మీదుగా ఘట్‌కేసర్‌ ‌వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతమయాత్రలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, శ్రీ‌ధర్‌ ‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌, ‌మాజీ ఎంపీలు వీ.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అరుణోదయ సాంస్క•తిక సమాఖ్య  విమలక్క పాల్గొన్నారు. అందెశ్రీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అందెశ్రీ పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నివాళులర్పించారు. మంగళవారం ఉదయం ఘట్కేసర్‌ ‌చేరుకున్న సీఎం.. అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఓదార్చారు.  లాలాపేట్‌ ‌జయశంకర్‌ ‌స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్‌ ‌దుగా ఘట్కేసర్‌ ‌వరకు అంతిమయాత్ర సాగింది. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అందె శ్రీ అంత్యక్రియల్లో మంత్రులు శ్రీధర్‌ ‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌, ‌పీసీసీ ప్రెసిడెంట్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌వి. హనుమంతరావు పాల్గొన్నారు. రచయిత అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  ఆయన అంత్యక్రియల సందర్భంగా సీఎం అందెశ్రీ పాడెమోసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతలను నేరుగా కలవనని చెప్పిన అందెశ్రీ, ఆ తరువాత డియా మధ్యమం ద్వారా కలిశాం.. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఆప్తుడిని కోల్పోయిన బాధను కలిగించింది అన్నారు. అందెశ్రీకి సముచిత న్యాయం కల్పిస్తాం.. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హా ఇచ్చారు. జీవితాంతం తెలంగాణ కోసం జీవించిన వ్యక్తి.. కళాకారుడిగా, రచయితగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసు అని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ కీర్తీ శాశ్వతం చేస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఆయన రచించిన రచనలు 20 వేల నిప్పుల వాగు పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో పెడతాం అన్నారు. అందెశ్రీ అభిమానుల నుంచి సూచనలు తీసుకుంటాం.. ఏనాడు ఆర్థిక ఇబ్బంది గురించి ఆరోగ్యం గురించి ఆలోచించని వ్యక్తి అందెశ్రీ.. అతడ్ని కోల్పోవడం బాధాకరంగా ఉంది.. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశా, ఈ విషయంపై ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తాను.. అందుకు కేంద్రమంత్రులు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌కోరారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను పాఠ్యాంశంగా తీసుకొస్తామని తెలిపారు. అందెశ్రీ రచనలను పుస్తక రూపంలో తీసుకొస్తామని చెప్పారు. అందెశ్రీ నిప్పుల వాగు పుస్తకం ఒక గైడ్‌ అన్నారు. అందెశ్రీ రచనలు అన్ని లైబ్రరీల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని.. ఆయన పేరు, స్ఫూర్తి శాశత్వంగా ఉండేలా చూస్తామన్నారు. అందెశ్రీ పాట, మాట  గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందని.. ఎన్నో సందర్భాల్లో ఇద్దరం కలిసి అనేక కీలక అంశాలపై చర్చించామని గుర్తు  చేసుకున్నారు. అందెశ్రీని కలిసినప్పుడల్లా సొంత అన్నను కలిసినట్టుగా ఉండేదన్నారు. గద్దర్‌ ‌తో పాటు అందెశ్రీ పాటు తెలంగాణ ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చాయని అన్నారు. అందెశ్రీ జయజయహే పాట తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని.. అందుకే జయజయహే పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామని తెలిపారు. ఆయన పేరుతో ఒక స్మ•తి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందెశ్రీ వ్యక్తిగతంగా తన మనసుకి దగ్గరి వ్యక్తి అని.. ఆయన లేని లోటు నా కుటుంబానికి వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని కానీ అవార్డు రాలేదన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని.. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి సహకరించాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుగా అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *