రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి

– విజన్‌-2047 డాక్యుమెంట్‌పై సోనియా ఆకాంక్ష

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో మంగళవారం అందజేశారు. ఆమెతో భేటీ అయిన సీఎం హైదరాబాద్‌లో ఈనెల 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ గురించి వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్‌ ప్రణాళికల గురించి కూడా సీఎం వెల్లడిరచారు. ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దూరదృష్టిని సోనియా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ విజన్‌ డాక్యుమెంట్‌ను అందించ‌డం, గ్లోబ‌ల్ స‌ద‌స్సు గురించి ఆమెకు వివ‌రించ‌డం త‌న‌కు ద‌క్కిన గొప్ప గౌర‌వం అని పేర్కొన్నారు. సోనియా స్పందిస్తూ మన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధించి సామూహిక కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఆమె ప్రోత్సాహకరమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు మన కలలన్నింటినీ ఫలించేలా చేయడానికి మరింత కష్టపడి పనిచేయడానికి మనల్ని ప్రేరేపిస్తాయ‌ని రేవంత్ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *