– సీఎం, డిప్యూటీ సీఎంల మహా శివరాత్రి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ మహా దేవుడిని ప్రార్థించారు. మహా శివరాత్రి ఉపవాసాలు, పూజలను భక్తిప్రవత్తులతో నిర్వహిస్తున్న భక్తులందరికీ శివయ్య ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
ప్రతి ఇల్లు భక్తి భావంతో విరాజిల్లాలి
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన రోజున రాష్ట్రంలోని ప్రతి ఇల్లు భక్తి భావంతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ మహాదేవుని ప్రార్థించారు. ఉపవాస దీక్షలు, జాగరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులందరిపై ఆ బోళాశంకరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. ఆధ్యాత్మికత, భక్తి భావనతో కూడిన ఈ పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో శాంతి, శ్రేయస్సు నింపాలని, రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





