హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2025 లభించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారి కాలంలో మానవాళి ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను అనిమేష అనే కవితా సంపుటిలో హృద్యంగా తెలియజేసిన మానవతావాది సిధారెడ్డి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అక్షరాలను ఆయుధాలుగా మలిచి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని వ్యాప్తి చేసిన ఘనత సిధారెడ్డికి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పలు కవితా సంపుటాలు, రచనలతో ఆధునిక తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీవేత్తల్లో సిధారెడ్డి ముందువరుసలో ఉన్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




