దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాల మూసివేత

ఈనెల 10 వరకు విమాన రాకపోకలపై నిషేధం
విమానాలను రద్దు చేసిన పలు విమానయాన సంస్థలు

న్యూదిల్లీ, మే 7 : పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ మరింత బలంగా ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్‌ సిందూర్‌  పేరుతో పాకిస్థాన్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్‌, లేహ్, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు నిలిచి పోయాయి. ఈ నెల పదివారకు ఆయా విమానాశ్రయాల నుంచి రాకపోకలను నిషేధించారు. అలాగే విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ వరకు 165కు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్‌సర్‌, బికనేర్‌, చండీగఢ్‌, ధర్మశాల, గ్వాలియర్‌, జమ్మూ, జోధ్‌పుర్‌, కిషన్‌గఢ్‌, లేహ్, రాజ్‌కోట్‌, శ్రీనగర్‌ సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి మే 10వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడిరచింది. ప్రయాణికులు ఎప్పటి కప్పుడు అప్‌డేట్‌లను చూసుకోవాలని తెలిపింది. ఆయా విమాన ప్రయాణికులు రీషెడ్యూల్‌ లేదా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, క్యాన్సిల్‌ చేసుకుంటే పూర్తి రీఫండ్‌ కూడా ఇస్తామని పేర్కొంది.ఎయిర్‌ఇండియా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. మే 10వ తేదీ ఉదయం వరకు శ్రీనగర్‌, జమ్మూ, లేప్‌ా, జోధ్‌పుర్‌, అమృత్‌సర్‌, భుజ్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, చండీగఢ్‌ ఎయిర్‌పోర్టులకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు వన్‌-టైమ్‌ రీషెడ్యూల్‌ ఛార్జీల మినహాయింపు కల్పించింది. లేదా పూర్తి రీఫండ్‌ ఇస్తామని తెలిపింది. స్పైస్‌జెట్‌, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌ విమనాలు కూడా రద్దయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *