ధూమపానం… ఆరోగ్యానికి హానికరం

 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న కేన్సర్‌లు, గుండె జబ్బులు, నాన్-కమ్యూనికెబుల్ వ్యాధులు (ఎన్‌సిడిలు) వంటి దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు ధూమపానం వలనే సంభవిస్తాయి. పొగాకు తాగేవారు శ్వాస సంబంధిత సమస్యలను కలిగి ఉంటారు ఎందుకంటే, పొగాకు ఊపిరి తిత్తులను పూర్తిగా ప్రమాదానికి గురి చేస్తుంది. అంతేకాకుండా, వీరిలో అధిక శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తుంది. 80% కంటే ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలకు ధూమపానం కారణమని తెలింది. సిగరెట్లలో 70కి పైగా హానికరమైన క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉంటాయి.
సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క ద్వారా తయారీ వల్ల పొగ విడుదల అవుతున్నందు వలన దీనికి ‘పొగాకు’ అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారు. దీనిని కొన్ని రకాల తాంబూలాలలో కూడా  ఉపయో గిస్తున్నారు. క్రీస్తు పూర్వం 1400 ఏళ్ల నాడే పొగాకు వాడకం మొదలైంది. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని స్థానిక తెగల వారు పొగాకును దేవుని కానుకగా పరిగణించే వారు. వేడుకల్లో పొగ తాగేవారు. పొగాకు చుట్టల నుంచి వెలువడే ధూమ మేఘాల ద్వారా తమ ప్రార్థనలు భగవంతుని చేరుకుంటాయని వారు నమ్మేవారు. యూరోపియన్లు అమెరికాలో అడుగు పెట్టడం ప్రారంభ మయ్యాక క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటికి పొగాకు క్రమంగా యూరోపియన్ దేశాలకు, ఆ తర్వాత శరవేగంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. బ్రిటిష్ వారి ద్వారా పొగాకు భారత దేశానికి చేరుకుంది. పొగాకు పరిచయం కావడానికి ముందు భారత దేశంలో ఎక్కువగా గంజాయి తోనే పొగ తాగేవారు. ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటు లోకి వచ్చిన తొలినాళ్లలో పొగాకును ఔషధంగా పరిగణించే వారు. సిగరెట్ల కంపెనీలు వైద్యులతో వ్యాపార ప్రకటనలు ప్రచారం చేసుకునేవి. 20వ శతాబ్దిలో సగానికి సగం కాలం ఇలాగే గడిచింది. పొగాకు వల్ల క్యాన్సర్ వంటి అనర్థాలు తలెత్తు తున్నట్లు గుర్తించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. పలు ప్రభుత్వాలు కూడా పొగాకు వాడకంపై ఆంక్షలు అమలులోకి తెచ్చాయి.
       బొలీవియా మరియు పెరూ పొగాకు జన్మస్థలంగా పరిగణించ బడతాయి. క్రిస్టోఫర్ కొలంబస్ యాత్రల ద్వారా ఐరోపాకు తీసుకు రాబడినట్లు, అలా పొగాకు సాగు క్రమంగా ఉత్తర అమెరికా, చైనా, భారతదేశం, పూర్వ  యుఎస్ ఎస్ఆర్ భూభాగంలో,  ట్రాన్స్‌కా కాసియా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, మోల్డోవా, ఉక్రెయిన్, క్రిమియా మరియు క్రాస్నోదర్ భూభాగంలో పెంచడం క్రమానుగతంగా జరిగాయి.
       ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మంది పొగ తాగుతున్నారని, ఏటా పొగాకు కారణంగా 70లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
       ప్రపంచం లోనే అత్యధిక శాతం  కిరిబాటి  దీవిలో మూడులో రెండొంతుల మంది మగవాళ్లు ధూమపానానికి అలవాటు పడ్డారు. మూడొంతుల మంది ఆడవాళ్లు కూడా పొగ తాగుతున్నారు.
యూరప్‌లోని మాంటెనెగ్రో  దేశంలో 46శాతం మంది ప్రజలకు పొగతాగే అలవాటుంది. గ్రీస్‌లో 50శాతం మంది మగవాళ్లు, 35శాతం మంది ఆడవాళ్లు ధూమపానం చేస్తారు. ప్రపంచం లోనే అత్యధికంగా ఈస్ట్ తైమూర్‌లో 80శాతం మంది మగవాళ్లు పొగ తాగుతారు. కానీ 6శాతం మంది ఆడవాళ్లకు మాత్రమే ఆ అలవాటుంది. రష్యాలో 15ఏళ్లు పైబడిన మగవాళ్లలో 60శాతం మంది పొగ తాగుతున్నారు. 23శాతం మంది మహిళలకు ఆ అలవాటుంది.
       ఇక తక్కువగా పొగ తాగేవారు ఉండే దేశాలు…ఘనా, ఇథియోపియా, నైజీరియా, ఎరిత్రియా, పనామా… ఈ ఐదు దేశాలూ అతి తక్కువగా పొగ తాగే దేశాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఆఫ్రికాలో 14శాతం మంది మాత్రమే పొగ తాగుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇటీవలి కాలంలో  అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారత దేశంలో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
      సిగరెట్లు, బీడీలు, సిగార్లు, హుక్కా వంటి ధూమపానం, గుట్కా నమలడం కోసం పొగాకును వివిధ రకాలుగా విక్రయిస్తారు. నికోటిన్ అనేది పొగాకులో ఉండే ప్రధాన విష పదార్థం. ఇది  ధూమపానం వ్యసనానికి దారితీస్తుంది.
       పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరి తిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే.
       ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న కేన్సర్‌లు, గుండె జబ్బులు, నాన్-కమ్యూనికెబుల్ వ్యాధులు (ఎన్‌సిడిలు) వంటి దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు ధూమపానం వలనే సంభవిస్తాయి. పొగాకు తాగేవారు శ్వాస సంబంధిత సమస్యలను కలిగి ఉంటారు ఎందుకంటే, పొగాకు ఊపిరి తిత్తులను పూర్తిగా ప్రమాదానికి గురి చేస్తుంది. అంతేకాకుండా, వీరిలో అధిక శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తుంది. 80% కంటే ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలకు ధూమపానం కారణమని తెలింది. సిగరెట్లలో 70కి పైగా హానికరమైన క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉంటాయి.
      కోవిడ్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో పొగ త్రాగడం చాలా వరకు తగ్గింది. పొగ తాగడం నేరుగా ఊపిరి తిత్తుల పై ప్రభావం చూపే విషయం వల్ల భయం ప్రధాన కారణం అయితే, లాక్ డౌన్ కట్టుదిట్టమైన చర్యల వల్ల షాపులు ఎక్కువ సమయం మూసి ఉండడం, ఇళ్లనుండి బయటికి వెళ్ళలేక పోవడం ధూమపానానికి ప్రతిబంధకాలుగా  మారడం పొగాకు వాడకం తగ్గడానికి కొన్ని కారణాలు.
-రామ కిష్టయ్య సంగన భట్ల,
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *