సీఎం రేవంత్ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని , క్రీస్తు ఎంచుకున్న‌ మార్గం ఆదర్శనీయమని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *