బాలల హక్కుల పరిరక్షణకు కృషి

– మంత్రి సీతక్కను కలిసిన కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఛాంబర్‌లో మంత్రి సీతక్కను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్పర్సన్‌ సీతాదయాకర్‌ రెడ్డి, ఇతర సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌ మూడు నెలల కాలాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో తొలి మూడు నెలల నివేదికను వారు మంత్రి సీతక్కకు సమర్పించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చేపట్టిన కార్యకలాపాలు, జిల్లాల్లో కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశాలు, బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు, క్షేత్రస్థాయి పర్యటనలు, యూనిసెఫ్‌ నుంచి తీసుకున్న శిక్షణ, స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు, ప్రచార కార్యక్రమాలు, జిల్లా పర్యటనలు, శిశు విహార్‌ సందర్శన, ఇందిరా మహిళా శక్తి మిషన్‌ వర్క్‌షాప్‌, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీ పిల్లలకు భరోసా కార్యక్రమాలు, బాల్యవివాహాల నివారణకు అవగాహన కార్యక్రమాలు, చేపట్టిన బాల అదాలత్‌లు, బాల మేళాలు, అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాలు, బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా చార్మినార్‌లో నిర్వహించిన కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల సందర్శన వంటి వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *