విద్యారంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…

యూనివర్సిటీలో ఖాలీ పోస్టుల భర్తీకి చర్యలు
ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాలీగా ఉన్న లెక్చరర్ పోస్టులలో 50 శాతం ఖాలీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం ద్వారా విద్యారంగంపై ఆయనకున్న శ్రద్దను సూచిస్తుందని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అన్నారురాష్ట్రంలో ఏ రంగంలో ఎలాంటి సమస్యలు వొచ్చినా తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకత అని కొనియాడారురాష్ట్రంలోని యూనివర్సిటీలో తగినంత మంది లెక్చరర్లు లేకపోవడం వల్ల న్యాక్ గ్రేడింగ్ తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ఇటీవల తాము సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారుఈ సమస్య తీవ్రతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారన్నారురాష్ట్రంలోనే అన్ని యూనివర్సిటీలోని లెక్చరర్ పోస్టుల్లో 50 శాతం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారనిఈ మేరకు గైడ్లైన్స్ విడుదలయ్యాయి అన్నారుసుమారు 10 ఏళ్లుగా యూనివర్సిటీలో లెక్చరర్ల నియామకం జరగలేదనిలెక్చరర్ల కొరత వేధిస్తుండముతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనిఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేశారన్నారుఇదిలా ఉండగా లెక్షరర్ పోస్టుల భర్తీ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందంటూ కొంతమంది కాంట్రాక్ట్పార్ట్ టైం అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారనివారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అని సిఎం భరోసా ఇచ్చారన్నారురాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పలు రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందనిఇదే సమయంలో అధ్యాపకుల బాగోగులు కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *