పోలీసు కాల్పులు : ఇద్దరు దొంగల‌కు గాయాలు

– ఘటనా స్థలిని పరిశీలించిన సిపి సజ్జన్నార్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 25 : హైదరాబాద్‌ ‌చాదర్‌ఘాట్‌లో ‌పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ ఘటనలో ఇద్దరు దొంగలు గాయపడ్డారని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌  ‌తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గాయపడి, పోలీసులకు చిక్కిన దొంగ ఒమర్‌పై 25 కేసులతో పాటు రౌడీషీట్‌ ఉం‌దని  తెలిపారు. దొంగలను పట్టుకునే క్రమంలో డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు. సెల్‌ఫోన్‌ ‌చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను డీసీపీ, ఆయన గన్‌మ్యాన్‌ ‌గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. దొంగలు గన్‌మ్యాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో గన్‌ ‌మ్యాన్‌, ‌డీసీపీ చైతన్య కింద పడిపోయారు. వెంటనే తేరుకున్న డీసీపీ, గన్‌మ్యాన్‌ ‌దొంగలపై కాల్పులు జ‌ర‌ప‌గా ఇద్దరు నిందితులు గాయపడ్డారు. నిందితుడు ఒమర్‌పై రెండుసార్లు పీడీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2016లో కామటిపురం పీఎస్‌లో నమోదైన పీడీ యాక్టు కేసులో ఏడాది జైల్లో ఉన్నాడు. 2020లో హుస్సేనీ ఆలమ్‌ ‌పీఎస్‌లో పీడీ యాక్ట్ ‌కేసులో ఏడాదిపాటు చంచల్‌గూడ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒమర్‌ ‌ప్రవర్తన మారలేదు. ఆ తర్వాత కాలాపత్తర్‌ ‌పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *