అవినీతికి తలవంచకుంటే అధికారులను బలిచేస్తారా?

– రిజ్వీ విఆర్‌ఎస్‌పై బండి సంజయ్‌ ‌వ్యాఖ్య

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌23: ‌మీ అవినీతికి తల వంచకపోతే అధికారులను బలి చేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌పాలనా వ్యవస్థ, అవినీతి రాజకీయాలకు ఐఏఎస్‌ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్‌ ‌నిదర్శనమని ఎక్స్‌లో పోస్టు చేశారు. నిజాయితీగల, సమర్థుడైన అధికారి వీఆర్‌ఎస్‌ ‌తీసుకునే పరిస్థితికి ఎందుకొచ్చిందన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందన్నారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారులను వేధిస్తారా అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టెండర్లలో మంత్రులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి బయటపడితే రాజీ పడని అధికారులపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో భారత రాష్ట్ర సమితి  ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ అధికారులను బలి చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేసు కేసులో తన తప్పులను దాచుకునేందుకు కేటీఆర్‌ అధికారులపై నిందలు మోపారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ‌సైతం భారత రాష్ట్ర సమితి దారిలోనే నడుస్తోందని దుయ్యబట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *