– 20న శ్రీశైలంలో స్వామి దర్శనం
– 21న హైదరాబాద్‌లో బీఎల్‌వోలతో సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలంలోని భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు(20వ తేదీ) తెల్లవారుజామున ఆయన మల్లికార్జున స్వామి ఆలయంలో మహా ఆరతి కార్యక్రమంలో పాల్గొని స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. ఏపీలో ఎలాంటి అధికారిక సమావేశాలు లేదా పరిపాలనా కార్యక్రమాలు ఉండవని అధికారులు తెలిపారు. తిరిగి అదేరోజు హైదరాబాద్ చేరుకుని షెడ్యూల్‌లో భాగంగా నగరంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్నాయి. 21వ తేదీన ఎన్నికల నిర్వహణలో కీలకమైన రాష్ట్ర బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌వోలు) హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



