‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చారిత్రక ప్రదేశాల సందర్శన

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించారు. శనివారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఈసీ ముందుగా గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గోల్కొండ కోటకు సంబంధించిన చారిత్రక, శిల్పకళా విశేషాలను పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు సీఈసీకి వివరించారు.అనంతరం సీఈసీ హుస్సేన్‌సాగర్ ను సందర్శించి సరస్సు మధ్యలోని బుద్ధ విగ్రహాన్ని దర్శించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి సత్యవాణితో పాటు ఎన్నికల విభాగానికి చెందిన ఇతర అధికారులు సీఈసీతో ఉన్నారు. అలాగే చార్మినార్ ను కూడా సీఈసీ సందర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *