Category Uncategorized

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం జిన్నారం మండల తహసిల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది తదితరులకు…

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలను పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ…

రోలర్ స్కేటింగ్ లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థిని

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్కు చెందిన బీ.ఏ. సెక్షాలజీ మూడో ఏడాది విద్యార్థిని రియా సబూ రోలర్ స్కేటింగ్లో ప్రతిభ చాటి ఒక బంగారు, రెండు రజత పతకాలను గెలుచుకుంది. ఇటీవల చెన్నయ్ లో నిర్వహించిన 61వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి…

బండల మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లోని బండల మల్లన్న జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.  భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆలయ…

రైతులకు మరింత చేరువగా డిసిసిబి సేవలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: వ్యవసాయాన్ని జీవన విధానం గా మార్చుకొని జీవనం సాగిస్తున్న రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత కృషి చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.పటాన్ చెరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో రెండు కోట్ల 40 లక్షల రూపాయల…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవకుల ప్రభుత్వం… ఎంపీటీసీ కుర్మనీ మంజుల దస్తప్ప

ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవకుల ప్రభుత్వమని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందనీ  ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంటుంది తప్ప పాలకుల కోసం కాదని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వలు లేకుండా నిజమైన అర్హులకు అందించడానికి…

దేశంలో నరేంద్ర మోదీ అనే మెడిసిన్‌ పని చేయదు

డబుల్‌ ఇంజిన్‌ అంటే ఆదానీ..ప్రధాని లోకసభలో రాహుల్‌ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజిన్‌ షెడ్‌కు పోయింది భారత్‌ న్యాయ్‌ యాత్రతో ప్రధాని ఇంజిన్‌ కూడా పని చేయదు నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాగ్‌పూర్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ప్రతి మందుకు ఒక ఎక్సపయిరీ డేట్‌ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర…

‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలోని వివేకానంద నగర్‌ డివిజన్‌ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌ కాలనీ లో…

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ‘ప్రజా పాలన’లో లబ్ధి చేకూరుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28:   ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకుంటుందని రాష్ట్ర బి.సి సంక్షేమం, రవాణా, హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌ వార్డు ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన  ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.…