ఖనన గీతిక
చచ్చిపోతున్న బతుకుకు లేదిక ఉపశమనం శవాలై దివాలై జీవచ్ఛవాలై మారణహోమంలో సలసల మరిగే రక్తపు బిందువుల మాడు కుంపట్లో ఒక ఇంట్లో దేహపు గూట్లో పసిరిక దీపం వెలిగిస్తానంటే ఓ ఓరీ ఓయీ ఓసీ… నీ మెదడే మొద్దుబారిన దిబ్బ నీ కలలే కబ్రస్తాన్ కట్టడాలు నీ చుట్టూ స్మశానవాటికలు దహనం ఖననం పుట్టుకతో వెంటొచ్చినయ్…
