Category తెలంగాణ

జూనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ పోటీలో  సిల్వర్ మెడల్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పెద్ద కుమారుడు అభిషేక్‌గౌడ్‌ కొడుకు  మహదేవ్‌ గౌడ్‌ హర్యానాలో ఈనెల 8 నుంచి 11 వరకూ జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.హర్యానా ఎంపీ భూషణ్‌ శరణ్‌సింగ్‌ చేతుల మీదుగా  మహదేవగౌడ్‌ గ్రాప్లింగ్…

ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమం, అప్రజాస్వా మికం, హేయమైన చర్య అని టీడీపీ నగర సీనియర్ నాయకులు డాక్టర్ నవీన్ వల్లం సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తనకు నచ్చిన వారు వివిధ కేసుల్లో నిందితులైనా వారిని…

తొలి హ్యాండ్ బ్లెండ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన బాస్ అప్ల‌యెన్సెస్‌

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 11 : ఇన్నోవేషన్, ఎక్సలెన్స్ కు మారుపేరుగా ఉన్న బాస్ అప్లయెన్సెస్, పరిశ్రమలో ముందెన్న‌డూ లేన‌ట్లుగా 5 సంవత్సరాల వారంటీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి హ్యాండ్ బ్లెండర్‌ను ప్రవేశ పెట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వంట పద్ధతులను పునర్నిర్వచించడమే కాకుండా భారతీయ కుటుంబాలు పనిచేసే…

వినాయక మండపం అద్యక్షులుగాఆశన్నాగారి కుమార్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహేశ్వరం మండలం కేంద్రంలో వినాయక వాటర్ ఫిల్టర్మెగావత్ శంకర్ అద్వర్యంలో ఉత్సవ కమిటీ అద్యక్షులుగా ఆశన్నాగారి కుమార్ ను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు మోదిని సంతోష్,పోతర్ల  గోపి,గుర్రం యాదయ్య ,చిపిశెట్టి రాఘవేందర్,నాగరాజు, శంకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

 ఆమనగల్లు సురసముద్రం వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 11 : ఆమనగల్లు మున్సిపాలిటీలో త్వరలో రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్ఞన కార్యక్రమాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్, ఎస్సై  బలరాం లతో కలిసి పరిశీలించారు.  సురసముద్రం చెరువులో గణేష్ నిమజ్జనం ఎర్పట్లు ఏ విధంగా చేయాలి తదితర విషయాలపై చర్చించారు.

మానవ రహిత ‘యుజివిని’ ఆవిష్క‌రించిన‌ జయేశ్ రంజన్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 11 : ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన రఘువంశీ గ్రూప్ తయారీ, సరఫరా చైన్ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన పరిష్కారాల్లో ముందంజలో ఉన్న పార్ ఈస్ట్ సంస్థ‌తో చేతులు కలిపింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్…

18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి

పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సహాయ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పరిగి పట్టణంలోని  పల్లవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటరు అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని…

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బాబు అరెస్టు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో త్రీవంగా ఖండించారు. చంద్రబాబుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే…

గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:గణేశ్ ఉత్సవాలు  ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ ముని తెలిపారు. ఆదివారం గణేశ్ మండపాల ఆర్గనైజింగ్కమిటీ సభ్యులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వినాయక మండపాల ఏర్పాటులోనిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వివాదాస్పద స్థలాల్లోవిగ్రహాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా రోడ్డుకు అడ్డంగా మండపాలను ఏర్పాటు…