Category తెలంగాణ

పెండింగ్ బిల్లుల సాధనకై మోకాళ్ళ పై  నిరసన సమ్మె లతోనే సమస్యల పరిష్కారం

ఘట్కేసర్ ప్రజాతంత్ర అక్టోబర్ 04:  సమ్మెలు ఉద్యమాలు కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతాయని సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్ సబిత పిలుపునిచ్చారు పెంచిన వేతనాలు పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల  చేయాలనికోరుతూ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఘట్ కేసర్  మండల కేంద్రంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు  గత 8రోజులుగా  సమ్మె చేస్తున్న…

గిరిజన బాలికల వసతి గృహం పట్టణంలో నిర్మాణం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: గిరిజన బాలికల వసతి గృహాన్ని వికారాబాద్ పట్టణంలో నిర్మాణం చేయాలని అఖిల భారతీయ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్ నాయక్. గిరిజన బాలికల కాలేజీ వసతిగృహము మంజూరు కావడం జరిగింది అట్టి కాలేజీ వసతి గృహము వికారాబాద్ పట్టణంలో బంజారా భవనం నిర్మించబడినటువంటి ప్రక్కన కాలేజీ వసతి…

తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: తాండూరు నియోజకవర్గం లోని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.బుధవారం తాండూర్ నియోజకవర్గంలో 108 కోట్ల 48 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే పైలేట్  రోహిత్ రెడ్డి తో కలిసి  మంత్రి…

ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 04 : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూసే పేదల మనిషి అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారని, ఈ విషయంలో అనేక పథకాలు రూపొందించి వాటిని విజయవంతంగా కొనసాగించడం జరుగుతోందని, పేదల పక్షపాతి…

ఏఎంపీఎల్ అత్యాధునిక స‌ర్వీస్ కేంద్రం ప్రారంభం

హిమాయత్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 04 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్‌) త‌న అత్యాధునిక స‌ర్వీసు కేంద్రాన్ని తెలంగాణ‌లోని పాల్వంచ‌లో ప్రారంభించినట్లు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి బుధ‌వారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛ‌త్తీస్‌గఢ్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ స‌హా ఆరు రాష్ట్రాలలో విస్తరించిన 105…

చుక్కాపూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడపడుచుల కోసం తయారు చేయించిన బతుకమ్మ చీరలను ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాపురం శ్రీనివాస్ రెడ్డి మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి కిష్టమ్మ, ఉప సర్పంచ్ జక్కు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ…

ఎల్ బి నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా  తీర్చిదిద్దుతా

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఎల్. బి నగర్ నియోజకవర్గ  అభివృద్ధి  తన లక్ష్యమని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్లో రూ. 9 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనుల కు  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. …

ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచిందని, మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు తెలంగాణ ఆడపడుచులు కొత్త చీరలు కట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ అన్నారు.చేనేత…

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు అన్నారు. ఆశా వర్కర్ల సమ్మె 10వ రోజు పటాన్ చెరు శ్రామిక భవన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి, వంటా వార్పు కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా…