Category తెలంగాణ

విదేశీ విద్యకు సహకారం : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటిఆర్

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : తెలంగాణకు చెందిన విద్యార్థులకు విదేశాలలో  విద్యనభ్యసించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కె. తారక రామారావు అన్నారని దిల్ సుఖ్ నగర్ లోని వీసా 9 కార్యాలయం ఎండి సాయికుమార్ మేడి ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని చికాగోలో…

ప్రజాప్రతినిధులే కేసీఆర్ కు బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే ఈటల రాజేంధర్

ఇల్లందు,ప్రజాతంత్ర,ఆగస్టు 26: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం అయితే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల…

కాంగ్రెస్, బిజెపి నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండలం పరిధిలో పులుమద్ది గ్రామానికి చెందిన మండల నాయకులు కాంగ్రెస్ బిజెపి నుంచి…

సర్పంచ్ చాంది కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : వాసుదేవపూర్ గ్రామం సర్పంచ్ పాత్లావత్ చాంది మృతి చెందిన విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి చాంది పార్థివ దేహాన్ని నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు గ్రామపెద్దలు బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని వాతావరణం అందిద్దాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: హరిత తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు భారీగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు చక్కటి వాతావరణం అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో మెగా ప్లాంటేషన్…

హోలియా దాసరి సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ. లక్ష సహాయం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని బిసి కాలనీలో అసంపూర్తిగా ఉన్న హోలీయ దాసరి సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నేత, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ…

వాసుదేవ్ పూర్ తండా సర్పంచ్ పాత్లవత్ చాంది మృతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : కడ్తాల్ మండలం వాసుదేవ్ పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాత్లవత్ చాంది (70) గుండెపోటుతో మృతి చెందారు ఆమె మరణ వార్త తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, కడ్తాల్ సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్…

అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : అవినీతి ఆర్టీవో అధికారులపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ముస్తఫా అంబేద్కర్ డిమాండ్ చేశారు. శనివారం అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ చెక్ పోస్టులో ఉంటూ వచ్చే పోయే వాహనాలు…

కడ్తాల్ తహసిల్దార్ ను సన్మానించిన ఎల్ ఎన్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : కడ్తాల మండలానికి ఇటీవల బదిలీపై నూతనంగా వచ్చిన తహసిల్దార్ షేక్. ముంతాజ్ ను కడ్తాల్ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు మల్లయ్య, బిక్షపతి, గణేష్, ఏఎంసీ డైరెక్టర్ లయక్ అలీ, నాయకులు యాదగిరి…