Category Shoba

పోరు పొద్దు పొడుపు

అంధవిశ్వాసాల్ని శ్వాషిస్తూ బండరాళ్లకు భజన చేస్తుంటే వాడు మందిరాల కట్టడాలకు వేగిరంగా పునాదుల్ని తీస్తాడు గళాల గడియలు బిగిస్తూ మౌన వ్రతాన్ని ఆచరిస్తుంటే వాడు జాతి మతీకరణ కోసం కాసాయ కత్తుల్ని జులిపిస్తాడు అచేతనా దుప్పటి ముసుగేసి మొద్దు నిద్దురలో జోగుతుంటే వాడు సర్వ సంపదల కొల్లగొట్టి దోపిడీ ముఠాకు కట్టబెడతాడు కూపస్థ మండూక రూపునెత్తి…

కలాంజీకి…సలాం

ఆయన… ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ మేధ అద్భుతాల గని ఆ చేత ఆవిష్కరణల నిధి ఓ సృజనశీలి ఓ ప్రభావశాలీ ఆ హాసం శాంతి చార ఆ వీక్షణం క్రాంతి ధార ఓ నిత్య విద్యార్థి ఓ సర్వత్ర సత్యార్థి ఆ పలుకు ప్రణవ నాదం ఆ ప్రవచనం ప్రమోద గీతం ఓ…

ఎ‌ర్ర కనకాంబరం

పెద్ద ఎరుపు కాదు కానీ అదో మెరుపు! ఓ చిన్న కాడకు నాలుగు రెక్కల కుసుమం తావి లేని పరాగం! అయినా నీ సిగలో అదో అద్బుతం! ఓ రెండు మూరల దండ! బారెడుజడలో దూరి ముంగురులతో అల్లరి చేస్తూ చెక్కిళ్ళపై ఆడుతుంటే! ఎక్కడో గుండెల్లో గుబులు అయ్యేది మనసు ఎందుకో దిగులు పోయేది! ప్రతీ…

బలిదానాల స్థూపాలు

త్యాగానికి రూపాలు నిలిపిన స్తూపాలు ఉద్యమానికి ఊపిరిపోసిన సజీవసాక్ష్యాలు విజయకేతనామై రెపరెపలాడే చరితమరువని బలిదానాలు కన్నపేగునుసైతం లెక్కచేయాని ఆరనిజ్వాలలు దూరమై అల్లాడుతున్న తల్లుల కడుపుకోతలు ఉద్యామాన్ని గుండెనెత్తుకుని చైతన్యగీతమైన రుధిరం ధారవోసిన త్యాగాలవీరులు సాధించిన విజయానికి నిలువెత్తు ఆత్మలశిఖరాలు ఆ బలిదానాలన్నీ ఏమెరుగని అట్టడుగు వర్గాలు ఆ స్తూపాలలో సమిదలు బహుజన బిడ్డలు వచ్చిన విజయాన్ని…

తప్పు నీదేగా!

మనిషి మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తూ గతి తప్పిన ఋతుపవనాలతో దెబ్బతిన్న సమతుల్యతతో ఓ వైపు కుండపోత వర్షాలు, మరొకవైపు ఉష్ణగాలులు ఇంకోవైపు కరవుకాటకాలు. ఈ ఉత్పాతాలకు కారకులెవరు? ఈ మార్పులు మానవప్రేరితాలు కావా? ఓ మనిషీ! ఒక్కసారి యోచించు. నువ్వు పుట్టింది ప్రకృతిలో, జీవిస్తున్నదీ ప్రకృతిపై ఆధారపడే కలిసిపోయేదీ ప్రకృతిలోనే. నీ స్వార్థం కోసం ప్రకృతిని…

నిజానికి మంచి పేరు లేదు..

నిజాలకి అబద్దానికున్నంత మంచి పేరు లేదు…. నటనకున్నంత పలుకుబడి రాదు…. స్వార్థానికున్నంత శక్తి కూడదు నిజాన్ని నమ్మిన మనసుది తెలివి తక్కువే ఉన్నదే ఉన్నట్లే పలికే పిచ్చి ఎక్కువే. నిజాల్ని దాచని మనసుగా మాటల మోసం తెలియని మనిషి నాలుక నిండారంబరం ఓ మనిషికి లోకం దూరమే… – చందలూరి నారాయణరావు, 9704437247

మౌన శకలం

మీరే నన్ను మారుస్తున్నారు నేను నడిచే దారిని వంపుతూ నన్ను విరుస్తున్నారు నా చేత మీవైనవి చేయిస్తూ నన్ను మిమ్మల్నిగా రూపంతంతరం గావిస్తూ ఆవిరి చేస్తున్నారు ఇంకేమి మాటాడను నేనేమన్నా అది మీరే మీ నుంచి వచ్చినవిగానే ఉంటయ్‌ ఎలా ఉన్నా మీకు అసంతృప్తే మౌనంగా మెగిలినా… పోనీ కనిపించకుండా పోనా నా అస్తిత్వం మీ…

స్వేచ్ఛాలోచనల పక్షిని

ఇంటి ముందర ఒంటరిగా ఉన్న కుర్చీ ఒళ్ళో కుదురుగా కూర్చొని ఏ వైనో, వార్తాపత్రికనో తీక్షణంగా చూస్తూ ఉంటానా కొన్ని పదాలు విరహంగా,విచారంగా,విషాదంగాను మరికొన్ని ప్రేమగా,జాలిగా,అసహ్యంగానూ కనిపిస్తాయి అన్నీ చదివాక మెదడు కుత కుత కాగుతున్న నీళ్ళల్లో పడ్డట్టు ఉబ్బిపోతుంది చికాకులో అన్నీ విసిరేసి అదే కుర్చీలో వాలుగా జారీ కూర్చోని కల్లుమూసుకుంటే మనసు….. లంగరేసి…

కవితా భాస్వరం…

దృశ్యించిన స్పందనతో ఉప్పొంగిన భావోద్వేగాల నుండి పుట్టిన కవిత్వంలో స్పష్టంగా అనుభూతుల సంవేదన ఉంటుంది. సకల మానవాళి సౌభాగ్య సౌభ్రాతృత్వాలను ఆకాంక్షించే శ్రేయో కవిగా వజ్ర పుష్పాలు అన్న తమ తొలి కవితా సంకలనం ద్వారా  నిలిచిన డాక్టర్‌ ‌కట్టా నరసింహారెడ్డి తన రెండవ సంకలనాన్ని స్వరం మారింది పేరుతో ఆవిష్కరించారు. చూపు ఉండి ఏమి…