Category Shoba

రామదాసు, కంచర్ల గోపన్న ఒకరేనా? – 1

‘విన్నపమాలకింపు రఘువీర! నహి ప్రతిలోకమందు నా/కన్న దురాత్మున్దున్, బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ/ కన్న మహాత్మున్దున్, బతిత కల్మష దూరుడు లేడు నాగ వి/ ద్వన్నుత నీవె నాకు గతి దాశరథి! కరుణాపయోనిధీ!’ అన్న పద్యం వినగానే, ఇది రాసింది కంచర్ల గోపన్నని, ఈయనకు ‘భక్త రామదాసు’ అనే మరో పేరుకూడా ఉందని తెలుగునాట ఎవరైనా చెబుతారు. కానీ,…

దళితుల భరోసా బావుటా

డా. కల్లూరి ఆనందరావు గారి లేఖిని నుంచి వెలువడిన “ఆలోకనమ్” సాహితీ వ్యాసావళిలో మొత్తం 24 వ్యాసాలు ఉన్నాయి. ఇందులో  అర్థభాగం ఇనాక్ గారి సాహిత్యం వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఇనాక్ సాహిత్య పరిశోధకులకు దళిత సాహిత్య అధ్యయన పరిశోధకులకి ఈ పుస్తకం ఉపకరిస్తుంది, ఈ పుస్తకంలో సగభాగం దళిత సాహిత్యానికి సంబంధించిన అనేక ప్రామాణిక విషయాలు…

Meta writing మరియు ఇద్దరి స్త్రీ అస్తిత్వవాదాలలో భిన్నత – 2

(కిందటివారం పూర్తివ్యాసం ముద్రణ కావలసి ఉంది కానీ కాలేదు. కొనసాగింపు భాగం ఇపుడు వేస్తున్నాము. పొరపాటుకు చింతిస్తున్నాము.) తమ మీద తల్లి నిరంకుశాధికారతను తప్పించుకుని బయటపడాలనుకున్న అరుంధతీ ఆమె అన్నా పదిహేడేళ్ళ వయసు లోపలే ఇంటినించి వెళ్ళిపోయి వారి బ్రతుకులు వారు లాగడం చేశారు తప్ప మళ్ళీ ఆమె దగ్గరనుంచి ఏ సహాయం స్వీకరించలేదు. ముఖ్యంగా…

ఈ సంఘీభావం మరిచిపోలేనిది

తెలంగాణ నుండి అమెరికా వెళ్ళిన తర్వాత, క్రొత్త దేశం, క్రొత్త మనుషులు, క్రొత్త సంస్కృతి, దానికి తోడు ఉద్యోగంలో ఎన్నో సవాళ్ళ వల్ల చాలారోజులు అంటే దాదాపు సంవత్సరాలుగా ఎలాంటి సాహిత్యం వైపు వెళ్ళలేదు. ఆ తర్వాత ప్రారంభించిన నా సాహిత్య మలిమజిలీలో చాలా విషయాలు నాలోని కథకుని తట్టిలేపాయి. అమెరికా పోయిన చాలామంది భారతీయులు…

దేవుడూ చదువుకున్నాడు కదా!

తను ప్రతిచోట ఇద్దరే ఒక్కరిగా భయమని ఇద్దరనే నటన నాటుకున్నారు ఏ నిజం దాడి చేస్తుందోనని ఒకరిని మార్చి ఇంకొకరులా రోజూ యుద్ధమే లోపల అందుకే ఒకడి చేతిలో వల మరొకడి చేతిలో తీయని రెండు మాటలు ఒకడు ముఖాలపై చప్పుడుతో మంచిని రంగు కలిపి పల్చగా చల్లుతాడు ఇంకోడు తెలివిని మరిగించి రుచి మార్చి…

Meta writing మరియు ఇద్దరి స్త్రీ అస్తిత్వవాదాలలో భిన్నత

‘Mother Mary Comes To Me’ పుస్తకం కవర్ లోపలివైపు ‘Memoir’ అని రాసి ఉంది. పుస్తకాన్ని లాంచ్ చేసినప్పుడూ, ఆ తర్వాత దాని గురించిన ఇంటర్వ్యూలలో ‘‘మా అమ్మ, ఆమెతో నా బంధము ఇందులోని విషయాలు‘‘ అని చెప్పింది రచయిత్రి. నిజమే, ప్రధానంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం (అదే ఆమె జీవితం కూడా) గురించి…

చెఱ!.. అతను జైల్లోకి వచ్చిపడ్డాడు

మెరుపు తీగెలు  జైల్లోకి రావడానికి ముందు కోర్టులో బోనెక్కాడు. అతను చెయ్యని నేరాలకు పోలీసులు ఆధారాలు చూపిస్తుంటే, చేసిన నేరాలు గుర్తుకు వచ్చాయి. కోర్టు సమయాన్ని లాయర్లూ జడ్జీలకన్నా యెవ్వరూ దుర్వినియోగం చేయలేరని కేసు మళ్ళీ వాయిదా పడ్డప్పుడు అనుకున్నాడు. శిక్ష తేలకుండా అతను అంత ఆనందంగా యెందుకు వున్నాడో జైలు సిబ్బందికి అర్థం కాలేదు.…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 5

(గత సంచిక తరువాయి) మెహర్లు, మాంగ్ లుఊరి బయట ఉంటూ, ఊరిని కాపలా కాయటం, ఊరిని శుభ్రం చేయటం, చనిపోయిన జంతువుల్ని తీసివేయటం, వాటి చర్మాలతో చెప్పులు కుట్టడం, తాళ్ళు పేనడం, బుట్టలల్లడం, పొలాలకు నీరు పారించడం, ఉన్నత జాతుల దయా దాక్షిణ్యాల మీద మనుగడ సాగించడం, ఇతర కులాల వారికి ఉండే సౌకర్యాలేవీ వీరికి…

నువ్వూ నేనూ నీడా!

ఎండ, తుపాకీ లేకుండా పేల్చేస్తోంది. వాడు అడుపు వీడు తుడుపు అని కాకుండా అందరికీ సమంగా వడ్డించేస్తోంది.   ఆ దారిన వొకే వొక పెద్ద చెట్టుంది. చెమటలు కక్కుతూ తనదగ్గరకు వచ్చినవాళ్ళకు గొడుగై నీడనిస్తోంది. అయితే ఆ గొడుగు కింద నీడ అందరికీ చాలడం లేదు.   నీడలో వున్నవాళ్ళు యెండనపడి వచ్చినవాళ్ళకి ‘నువ్వు…