Category సాహిత్యం-శోభ

యుగ యుగాల ఉగాది పర్వం

చైత్ర శుక్ల పాడ్యమి సృష్టి కి అంతం అదే రోజు యుగం ఆరంభం ఆ రోజే యుగాదిగా పరిగణం అదే కాల క్రమేణా ఉగాదిగా ప్రాచుర్యం. ఈ ఉగాది పర్వదినం నాడే వసంత ఋతువు ప్రారంభం అదే నేటి రోజుకు మరో విశేషంనూతన సంవత్సరం ఈనాటినుండే ప్రారంభం. పెద్దవారి ఆశీర్వాదం ఇష్ట దేవుడి ఆరాధనం మనసుకుకలిగించు…

పేరు నిలుపుకో…

చైత్ర మాసపు ఉషస్సులా, ఆనంద భాగ్యాలనిచ్చు వసంతవాహినిలా, ప్రజల మదిన రమ్యభావమలర ఆత్మీయతానురాగాల్ని ఆకాంక్షల భావాల్ని పెనవేసుకుంటూ తెలుగునేల వైభవం వెలిగేలా సంస్కృతీ సంప్రదాయాలు సందడి చేస్తుంటే, విచ్చేస్తున్నజి తెలుగువారి షడ్రుచుల సంతోషాల సారధీ ఓ శుభకృత్‌! ఊహలకు సరికొత్త ఊపిరినిస్తావని నీ కోసం తెలుగు లోగిళ్లు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాయి. బతుకుల్లో బాకులు దూసిన గతవత్సరపు…

శుభముల శుభకృతు

సకల జనుల సంతోషాలకు శుభ సూచకమై వస్తున్నది శుభకృత్‌ ‌నామ దారి ఉగాది శిశిరం రాలుస్తున్న ఆకులు ఉక్రెయిన్‌ ‌రష్యా యుద్ధం లో కూలుతున్న దేహాల శ్వాసలు మొండి ఆశల మోడులు పచ్చని చిగురుల పందిళ్లు వేసి కోయిలలను ఆహ్వానిస్తున్నవి యుద్ధంలో అలసి జెలన్స్కి పుతిన్లు కోయిలల మధ్యమ స్వరాలులు విని శాంతి చర్చలు జరుపుచుండిరి…

అమ్మ పాటల్ని

ఏ చరిత్రా చెప్పలేదు నాకు యుద్ధం చేయమని ఏ పురాణమూ ఇతిహాసమూ నేర్పలేదు సరైన పాఠం ఎముకల దారిలో మృత్యువు భుజాన్ని ఆసరాగా తీసుకుని గడిచిన గతాన్ని శాంతి వచనాల్లా వల్లేవేస్తూ ఎదురుచూసే గుమ్మాలకు రేపటి తోరణాలు కడుతూ కోల్పోయిన కడుపులకు సర్ది చెప్పుతూ అరణ్యరోదనల పర్వంలో ఎన్ని పాత్రలో సజీవదహనం చేయబడ్డవి ఇంకా వారి…

దుఃఖ దీపం

తనువులోని రక్తాన్నంత చమురుగా పోసి ఒంట్లోని నరాలన్నింటిని వత్తులుగా పేని.. జీవితపు ఆశలను ప్రమిధలుగా చేసి.. ఎదలో రగులుతున్న కష్టాలను.. నిప్పురవ్వలుగా రాజేసి వెలిగించిన దీపం.. బలంగా వీస్తున్న గాలి తాకుల్లకు ఊగిసలాడుతూ కన్నీరు కారిస్తుంది. ఉహాలనే ఆధారాలకు వ్రేలాడుతున్న వెలుగులన్ని.. కాలం విసిరిన కత్తుల వేటకు తెగిపడుతున్నాయి. నిశీధి కమ్ముకున్న నల్లని ఆకాశంలో.. తారలన్నీవెలుగుపూలు…

ఆశాగీతి

చైత్రమాసపు ఉషస్సులా జగతిని మైమరపించే వసంతభామినిలా పచ్చని చిగురుటాకుల పావడాకట్టి కబరిపై మల్లెలు సింగారించి మధుపములు మంజులనాదం చేస్తుండగా చిరునగవులొలికిస్తూ హంసలా అడుగులేస్తూ మధుమాసపు కోకిలలు పంచమంలో స్వాగతగీతం పాడుతుండగా తెలుగు వెలుగు నేనని షడ్రుచుల సమ్మేళనం నేనేనంటూ మమతానురాగాలను పెనవేసుకుంటూ అందరి ఆశలు ఈడేర్చగ వసంత సంతకం చేస్తూ శుభాలిచ్చుటకై శుభముఖంతో వేంచేస్తున్న వయ్యారిభామ…

ఉగాది పచ్చడి

చూతక ఫలం పలకరింపుతో పాతకములన్నీ పోయేనుగాక! నింబపు విరుల పుప్పొడితో గరళపుఅమ్మల స్వాంతనకాగ! ఇక్షువు గడల మధురముతో కుక్షము గోడలు శాంతములాడ! అమలక రుచుల చక్కిలింతతో జిహ్వపు చూరులు కితకితలాడ! మిరప ఘాటు రేగినవేళల్లో నవనాడుల్లో నీటి ఊటలురేగ! గుడచూర్ణము అనుపానముతో అమృతపానము కంఠమునేగ! సప్తరుచుల సమ్మేళనమే జీవితమంటూ! నవగ్రహముల గమనములే దిశా నిర్దేశంచేస్తూ! కాలంమార్పు…

సకల శుభాల ఉగాది!!

వేపచెట్టుకి ముత్యాలు పూసి తళ తళా మెరుస్తుంటే మామిడి చెట్టుపై గుండ్రటి నక్షత్రాలు నోరూరిస్తుంటే సూరీడి కళ్ళల్లో కూసింత వేసంగి తాపం సురుక్కుమంటే పాట విని వెళ్ళమని దారిలో చెట్టు చెట్టుకి ఎగిరొచ్చి కోయిల పిలుస్తోంటే శిశిరపు పత్రాల్లో హరితం ఆవిరై మట్టిలో కలిపితే వాసంతం చిగుర్లేసి హరితం ఆయువై కళకళలాడిస్తే చైత్ర శుద్ధ పాడ్యమి..ఉగాదై…

శ్రీ శుభకృత శోభలు

ప్రకృతి పాడే పరవశ గీతిక ఉరకలెత్తించే ఉగాది వేడుక ఇంటింటా ఆనందాల కానుక సుఖ దుఃఖ సమ్మిళిత నాటిక అరాచకాల్ని పాతరేసే పాదుక శ్రీ శుభకృత సుగంధాల వీచిక ! జీవనసారం ఇరిగిపోయి.. పచ్చనాకులు పాలిపోయి.. ఎండుటాకులై ఎగిరిపోయి.. బోసి పోయే కొమ్మ రెమ్మలు.. ఆమని దయచేయడమేగా.. ప్రకృతి నేర్పే బతుకు పాఠాలు ! గుత్తులు…