Category జాతీయం

అన్ని రాష్ట్రాల్లో సరిపడా గ్యాస్ నిల్వలు

– వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన న్యూదిల్లీ, మార్చి 16 : వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రా ల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపింది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే…

ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’

– ఖతార్ నుంచి గ్యాస్‌తో వచ్చిన నౌక – భారత్‌కు దక్కనున్న భారీ ఊరట ముంద్రా, మార్చి 16: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో బయలుదేరిన భారీ ట్యాంకర్ ’శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. దీర్ముజ్ జలసంధి వద్ద…

ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రం

– దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి – ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు టెహ్రాన్, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు…

మధ్య ప్రాచ్యంలో యుద్దం వేళ చైనా దూకుడు

– తైవాన్ దిశగా యుద్ద నౌకలు, విమానాల మోహరింపు తైపీ, మార్చి 16: మధ్య ప్రాచ్యంలో యుద్దంతో అంతా అటువైపు దృష్టి పెట్టగా చైనా మరోమారు తైవాన్‌పై దృష్టి సారించింది. రెండు వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం మళ్ళీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ…

కటక్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్ర‌మాదం

– ఐసీయూలో చెలరేగిన మంటలు – పదిమంది రోగుల దుర్మరణం భువనేశ్వర్, మార్చి 16 : ఒడిషా రాష్ట్రం కటక్ సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది రోగులు దుర్మరణం చెందారు. మరో 11మంది సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. కటక్‌లోని ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రామా…

శబరిమలలో మహిళలకు ప్రవేశం – కేరళ స‌ర్కార్‌ యూ టర్న్ ‌

– 50 ఏళ్ల లోపు వారికి అనుమతి కుదరదు – ‘సుప్రీమ్‌’‌కు నివేదన తిరువనంతపురం,మార్చి 14: 50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్‌…

దేశంపై యుద్దప్రభావం పడకుండా చర్యలు

– గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న కాంగ్రెస్‌ ‌- దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఆ పార్టీ వైఖరి – అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు గౌహతి, మార్చి 14: మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా ఏమాత్రం బాధ్యతలేని…

పెట్రోల్‌, ‌డీజిల్‌లకు కొరత లేదు

– బాటిళ్లలో వాటిని సరఫరా చేస్తే కఠిన చర్యలు – తమిళనాడు ఘటనలో డీలర్‌షిప్‌ ‌రద్దు చేసిన కేంద్రం – పెట్రోలియం శాఖ కీలక ఆదేశాలు జారీ న్యూదిల్లీ, మార్చి 14: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందు జాగ్రత్తగా పెట్రోల్‌, ‌డీజిల్‌…

కోల్ గ్యాసిఫికేషన్‌తో విలువైన వనరుల ఉత్పత్తి

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి’ నాగ్‌పూర్, ప్రజాతంత్ర, మార్చి 14: కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ద్వారా అమోనియా, హైడ్రోజన్, అమోనియం నైట్రేట్ వంటి విలువైన వనరులను దేశీయంగా ఉత్పత్తి చేసుకునేందుకు వీలవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు కేవలం విద్యుత్ ఉత్పత్తికి…