Category జాతీయం

హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలి మృతి

– ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి – ప్రభుత్వం తరఫున రూ.30లక్షల పరిహారం ప్రకటన బెంగళూరు, మార్చి 21 : కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది. గర్భంతో ఉన్న హిప్పోను పరీక్షించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల సమీ…

గ్యాస్‌ ‌కొరత నివారణకు కేంద్రం చర్యలు

– 20శాతం అదనపు కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా న్యూదిల్లీ, మార్చి 21: వాణిజ్య గ్యాస్‌ ‌కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 20శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి ముందున్న కేటాయింపుల్లో 50శాతానికి చేరినట్లయ్యిందని పేర్కొంది. అయితే, వీటిలో హోటళ్లు, రెస్టరంట్లు, దాబాలు,…

యుద్దం విరమించే ఆలోచనలో ఉన్నాం

– ఇరాన్‌పై యుద్దంలో తుది దశకు చేరుకున్నాం – సైనిక చర్యలను తగ్గించే విషయం పరిశీలిస్తున్నాం – ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ – ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత వాషింగ్టన్, మార్చి 21 : పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్, గ్యాస్ నిల్వలు తగ్గడం, రవాణా ఆగిపోవడంతో…

యుఎన్ఐ కార్యాలయం స్వాధీనం

– జర్నలిస్టులను బయటకు పంపిన పోలీసులు – హైకోర్టు ఆదేశాలతో కేంద్రం నిర్ణయం న్యూదిల్లీ, మార్చి 21 : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తా ఏజెన్సీ కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి మూసివేశారు. పారామిలిటరీ దళాలు, దిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ కార్యాలయంపై దాడి చేశాయి. సుమారు 50 మంది…

డాలర్‌తో రూపాయి మారకం 93.15 కు చేరిక

– మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యం న్యూదిల్లీ, మార్చి 20: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ట్రేడింగ్‌ ఆరంభంలో రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93.15 వద్దకు చేరింది. గల్ఫ్ ‌దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం రూపాయి మారకం విలువపై…

దిగుమతులు తగ్గించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 18: క్రిటికల్ మినరల్స్ విషయంలో మనం ప్రస్తుత పరిస్థితుల్లో 90 నుంచి 95% వరకు దిగుమతులపై ఆధారపడుతున్నామని, దీన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో…

ఆదివాసీ అభివృద్ధిపై శ్రద్ధ లేని బీజేపీ సర్కార్

-ఆదివాసీ హక్కుల పరిరక్షణలో విఫలం – మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: ఆదివాసీ ప్రాంతాల సహజ వనరులపై బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఆ ప్రాంతాల ప్రజల అభివృద్ధిపై కనిపించడం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. దిిల్లీలోని ఇందిరా భవన్‌లో లోక్‌సభలో ప్రతిపక్షనేత…

ప్రజాసేవలో పదవీ విరమణ లేదు

– రాజ్యసభ ఓ ఓపెన్‌ ‌యూనివర్సిటీ – సీనియర్‌ ‌సభ్యుల సేవలు ఇతరులకు ఆదర్శం – రిటైర్‌ అవుతున్న సభ్యుల వీడ్కోలులో ప్రధాని మోదీ – మాతో ప్రేమాయణం.. మోదీతో అనుబంధం – దేవెగౌడపై ఖర్గే చ‌తురోక్తులు న్యూదిల్లీ, మార్చి 18: పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవ ముగిసినట్టు కాదని రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న…

ఆధార్‌తో పాన్‌ పొందేందుకు ‌31వరకు గడువు

న్యూదిల్లీ, మార్చి 18: కొత్త పాన్‌ ‌కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్‌ ‌కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్‌ 1‌వ తేదీ తర్వాత కొత్త పాన్‌ ‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ ‌కార్డుతోపాటు అదనపు డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది.…