గుప్పెడు మెతుకులకై వెతుకులాట…

కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల వరదలు, ఈదురు…








