Category శీర్షికలు

తెలుగు సాహిత్యం వెనుకబాటులో ఉందా?

తెలుగు సాహిత్యం అనాదిగా మహోన్నత ప్రవాహం. నాటి పద్య కవితా వైభవం నుండి ఆధునిక వచన కవిత్వం, కథానిక, నవలల వైవిధ్యం వరకు తెలుగు సాహిత్య ఖజానా అపారమైనది. అయితే, నేటి డిజిటల్ యుగంలో, సమాచార విప్లవం, పాశ్చాత్యీకరణ ప్రభావాల నేపథ్యంలో, తెలుగు సాహిత్యం వెనుకబాటుకు గురవుతోందా? అసలు ‘వెనుకబాటు’ అంటే ఏమిటి? నాణ్యతలో కొరవడటమా,…

మెరుపు తీగెలు సురాప్రాణము

“ఎన్ని సార్లు చెప్పాలి?” “పర్లేదు చెప్పు, నీకు తాగే వోపిక వుంది. నాకు వినే వోపిక వుంది” “అంటే?” “సండే వీకెండ్ వదిలేసెయ్, మండే?” “ఊ… మా ఫ్రెండ్‌వాళ్ళ మేరేజ్ డే, నువ్వొచ్చావ్ కదా?” “సాక్షాలు వద్దు. ఫ్రెండ్స్‌తో తాగావ్, వోకే. ట్యూజ్ డే?” “మా కొలీగ్ రిటైర్మెంట్ ఫంక్షన్, ప్రెజర్ చేస్తే?” “వాళ్ళకోసం ప్రెజర్…

కవనోదయ కాంతి పాట

అక్షర జీవనదులకు పల్లెపలుకులతో ప్రాణంపోసి జానపద జవసత్వాన్ని నింపి ప్రపంచ పటంపై మట్టి పాటల కలలను పారించారు పనైపోయిందనీ అవనిపై మౌన మునిలా అందెశ్రీ అస్తమించారు   కాలం గుండెను చీల్చుతూ మట్టి కిరణాల ప్రవాహమై మన గుండెల్లో కవనోదయ కాంతి పాటై ప్రతిధ్వనిస్తున్నారు   తెలంగాణ భావాల ఉద్యమ గొంతుకై నిలిచి మానవత జాడకై…

కాగల కార్య గంధర్వ బబ్లూ!

 “ఇంకో మాట చెప్పు” అంది అనసూయ. మాలతి మాట్లాడలేదు. “అంతేలే, యెవరైనా ఆరుమాసాలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, అలాంటిది ఆరేళ్ళు సంసారం చేస్తే?” నవ్వింది అనసూయ. మాలతి నవ్వలేదు. “కానీ, భార్యాభర్తల్లో యెక్కువ మంది భర్తల్నే అనుసరిస్తారు భార్యలు” చివరి పదం వొత్తి పలుకుతూ అంది అనసూయ, ఆమాటలో ‘నువ్వు కూడా అంతే, అందర్లానే’…

‘Biased’ కేవలం పుస్తకం కాదు…

తోటి మనుషుల పట్ల సమూహాల పట్ల మనము పెరిగిన సామాజిక నేపధ్య ప్రభావాలతో ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలను జాతి, రంగు, ప్రాంతం పేర్లతో చూపించే పక్షపాత వైఖరుల గురించి  జెన్నిఫర్ ఎల్. ఎబర్‌హార్డ్ అనే రచయిత ఒక పుస్తకం రాసారు. ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా తనకు ఎదురైన పరిస్థితులు, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తగా…

చిన్నారి గుండెల్లో ఊహాశక్తి

కథ, నవల, బాల సాహిత్య రచయిత, సామాజిక కార్యకర్త వి.శాంతిప్రబోధతో బాలల దినోత్సవం సందర్భంగా బాలసాహిత్య తీరుతెన్నులపై ముఖాముఖి బాల సాహిత్యం పరిధి అంటే ఏం చెపుతారు? బాలసాహిత్యం అంటే కేవలం కాలక్షేపం కోసం చెప్పే కథలు, పాటలు మాత్రమే కాదు. ఇది పిల్లల మనసుకు పోషకాహారం లాంటిది. చిన్నారి గుండెల్లో ఊహాశక్తిని పెంచే, ఆలోచనలకు…

రెప్పలేని కన్ను

విజ్ఞాన సాంకేతిక సార్వభౌమా మానవుడా.. అభినవ దానవుడా ఈ వింతల విశ్వాన్ని వీక్షిస్తున్న సంబరం నీరుగారుతోంది నిద్దుర లే ఏం చెప్పనయ్యా ఇప్పుడు బ్రతుకు రెప్పలేని కన్నయ్యింది గరగరల గరళం కన్ను దిగుతోంది చూశావా నీ రెటీనా చాటున దాగిన దృశ్యాన్ని బజారున బహిరంగ పరుస్తున్నారెవరో హ్యాకింగ్ హుక్స్ ఒళ్లంతా పొడుస్తున్నాయి భద్రతగా వాల్చుకున్న రెప్పల్ని…

రామదాసు, కంచర్ల గోపన్న ఒకరేనా? – 3

సంప్రదాయ రామదాసు భక్తులు మార్టిన్, హవార్ట్ లు రాసిన దానిని విశ్వసించారు. అయితే యక్షగాన రచయితలు, కవులు రామ, లక్ష్మణులు మారువేషంలో అబుల్ హాసన్ తానాషాకు కనిపించి రామదాసు చెల్లించవలసిన మొహరీలని ‘రామటెంకె’ల రూపంలో బంగారునాణేలుగా చెల్లించినట్టు చెబుతారు. ఇక్కడ ఇంకోవిషయం చెప్పాలి. రామదాసుకు కబీర్ దాసు ‘రామతారకమంత్రం ‘ఉపదేశించినట్టు రజనీ రాశారు (పుట 29).…

పూలవనం

ఇక్కడ ప్రతి పూటా ఎందరో ఆడపిల్లల పొత్తి కడుపులు సన్నని కత్తులతో కోయబడుతున్నాయి దాన్ని మనసారా స్వాగతిస్తున్నారు వాళ్ళంతా ఇక్కడ ప్రతి పూటా పసిబిడ్డల దుఃఖపు అరుపులు ఘంటానాదాల్లా వినిపిస్తున్నాయి ఆ ఏడుపు వింటూ సంతోషిస్తున్నారందరూ లోపల ఓ మనిషి నొప్పులతో విలవిలలాడుతుంటే ఆందోళనను, ఆనందాన్ని ఏకకాలంలో ప్రదర్శిస్తున్నాయి బయట ఆత్రుతతో నిలుచొనున్న మనసులు ఇక్కడ…