Category శీర్షికలు

మండుతున్న కూరగాయల ధరలు

రోజురోజుకు కూరగాయల ధరలు మండుతున్నాయి. వేసవికాలంలో ఎండలు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతను ఈ సంవత్సరం చూశాం.ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గి చల్లబడుతుందన్నటువంటి తరుణంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలను మంట నేక్కిస్తున్నాయి.మామూలుగా అయితే వేసవిలో కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం రాగానే తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు అది దానికి విరుద్ధంగా ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా…

సంకీర్ణ ప్రభుత్వానికి ఎదుట సవాలు..

ఆ  రాష్ట్రాలు ఎలా వోటు వేస్తాయనే దానిపై కేంద్రం స్థిరత్వం ఆధారపడి ఉంటుంది ప్రారంభంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వొచ్చింది. అయితే అది స్థిరంగా ఉంటుందా? ప్రభుత్వానికి తక్షణ ముప్పు తప్పేలా లేదు. అయితే, రాబోయే నాలుగు నెలల్లో, నాలుగు రాష్ట్రాలు.. జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్-ఎన్నికలు…

పిడుగుల నుండి రక్షించుకోవడం ఎలా..???

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. ఆకాశంలో మేఘాలలో మెరుపులు ఏర్పడతాయి. కాని వీటిలో కొన్ని మాత్రమే భూమిని తాకుతాయి. ఇలా భూమిని తాకిన మెరుపులే పిడుగుకు కారణమవుతాయి. నీలి రంగు మెరుపులు చాలా ప్రమాదం. పిడుగు ఎలా ఏర్పడుతుంది: ఇరవైఐదు వేల అడుగుల ఎత్తున ఉన్న మేఘాలకు పైనుంచి సూర్యరశ్మి…

ఆహార కల్తీ తో అనారోగ్యం

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలు సాధ్యమైనంత వరకూ తినకపోవడమే మంచిది.దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఏది కొనాలి అన్న.. తినాలి అన్న…

ప్రకృతే ప్రథమ గురువు

   గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం  పట్ల సరైన అవగాహన, ఆచరణను కలిగి వున్నప్పుడే మానవ జీవితాలకు ఒక సార్ధకత లభిస్తుంది. సమాజంలో నెలకొని ఉన్న మతపరమైన ఆధిపత్య, మూఢత్వ సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ప్రధాన భూమికగా నూతన సంస్కృతి, సాంప్రదాయాలను ఏర్పరుచుకొని, ఇప్పటి వరకు యదార్థ జీవన విధానం కోసం పాటుపడిన తత్వవేత్తలను, వారు ప్రవచించిన సిద్ధాంతాలను, సమూహాలను ఆలంబనగా చేసుకొని మానవీయ కోణంలో వాస్తవిక జీవన విధానంతో…

“బంగారు తల్లులకు”బాత్ రూములు కట్టరా ?

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మాలిక వసతులు చేపట్టడానికి ఇచ్చిన ఉత్తర్వులు జిఓ ఎంఎస్ నం.5 జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కమిటీలు పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించటం కోసం పది అంశాలుగా శ్రీకారం చుట్టారని చెప్తున్నాడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంతో ప్రశంసనీయమైనదని గొప్పలు గుప్పిస్తున్నారు…

అఘోరిస్తున్న విశ్వవిద్యాలయాలకు అడ్మిషన్లు రెండు సార్లు

ఊడిపోయే జుట్టు ఎంత ఒత్తిన ఏముందిలే  అంటాడు  సినారె,  అయ్యవార్లు లేక, రీసర్చ్ గ్రాంటులు, బ్లాక్ గ్రాంట్స్ లేక శ్మశాన ప్రశాంతత నెలకొన్న విశ్వవిద్యాలయాలలో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లని యూజీసీ ప్రకటించింది.  గత  పది సంవత్సరాలుగా  దేశంలోని విశ్వవిద్యాలయాలలో  చలనం లేకుండా పోయింది.  విశ్వవిద్యాలయాల పరిస్థితి సమీక్షించుకుంటే అశాంతి, అలజడులు, సుదీర్ఘ పోరాటాలకు ప్రధాన కారణం బోధన సిబ్బంది నియామకాలే అని గ్రహించగలం. బోధన,…

మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి!

మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నంఅసమానతలను తొలగించిన నాడే ఆచరణ సాధ్యంసమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానం సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు..చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీలను…

సంస్థాగత ప్రజాస్వామ్యం అంటే…?

మన దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ‘సంస్థాగత ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం కాకపోవడం మన ‘‘పరిణత’’ రాజ్యాంగ ప్రక్రియలో నిహితమై ఉన్న ప్రధాన లోపం. లోక్‌సభకు, రాజ్యసభకు రాష్ట్రాల శాసనసభలకు, శాసన మండలులకు జరుగుతున్న ఎన్నికలలో వివిధ పక్షాల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ‘అభ్యర్థుల’ను ఆయా రాజకీయ పక్షాల ‘అధిష్ఠాన వర్గాలు’ నిర్ణయిస్తు న్నాయి.…