శాంతి కపోతాలు ఎగరాలి..!

రెక్కలు విప్పుకున్న సామ్రాజ్యవాదం మితిమీరిన రాజ్యకాంక్షతో మానవీయతను విస్మరించి రగిలించే యుద్ధజ్వాలలు ఆరని అగ్నిజ్వాలలై రావణకాష్టంలా మండుతున్నాయి! ఆధిపత్యం కోసమో, ఆక్రమణల కోసమో ఆత్మరక్షణకో, ఆయుధాల విక్రయాలకో సాగించే యుద్ధోన్మాద చర్యలు ప్రళయ భీకర యుద్ధాలుగా మారి సృష్టించే మారణ హోమాల్లో జనజీవనం ఛిద్రమైపోయి చిన్నారులు, మహిళలు, వృద్ధులు తుపాకుల తూటాలకు బలియై నెత్తుటి మడుగుల్లో హాహాకారాలు చేస్తూ మృత్యువు ఒడిలో…








