Category శీర్షికలు

సామాజిక అసమానతలు రూపుమాపడానికి గళమెత్తిన గద్దర్‌

ప్రజా వాగ్గేయ కారుడు, ప్రజా కవి, కళాకారుడు ప్రజా   యుద్ధ నౌక గద్దర్‌  తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయి పద్దెనిమిది నెలలయింది.  గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు,  మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌కు చెందిన లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జనవరి 31న 1949లో ఆయన…

నాన్న

నాన్న అనే పదం రెండు అక్షరాలు తన భాద్యతలు మాత్రం మోపెడు తండ్రిగా, కొడుకుగా, భర్తగా అల్లుడిగా తన భాద్యతలు నిర్వహిస్తున్నాడు…. మన పుట్టుకతో సంబురపడుతూ గుండెలపై ఆడించిన రోజులు మధురం నాన్న వేళ్ళు పట్టుకుని బుడి బుడి అడుగులతో ప్రయాణము మొదలు పెట్టి నాన్న భుజాలపై మొదటి సారిగా ప్రపంచాన్ని చూసి….. పోటీ ప్రపంచంలో…

మతోన్మాద ఉచ్చు

ఒక గంపలో రెండు కత్తులు. భక్తి – భయం తెగిపడ్డ నెత్తులు, ఈ మతోన్మాద మోదంలో నువ్వు బలిపశువ్వి. నిన్న వేరొకడు – నేడు నువ్వే, నీ ప్రశ్నలంటే భయం వాడికి. జవాబుల్లేని పేడ బుర్రవాడిది, నీ విమర్శంటే ఒళ్లంతా వణుకే. కర్షక శ్రమనెరుగని దోపిడీ దొంగే, తర్కం లేని వాడి మొఖం చూడు! సహజ…

కవితాదాహం

కవిత్వం కవులకు కలిగేదాహం ఎప్పటికీ తీరనిదాఘం కవిత్వం మనసులతొలిచే కీటకం మదులలోపుట్టే ప్రకరణం కవిత్వం ఆలోచనల పర్యావసానం భావజ్వాల బహిర్గతరూపం కవిత్వం అక్షరాల అల్లకం పదాల పేర్చటం కవిత్వం పువ్వుల హారం పరిమళ ప్రసరణం కవిత్వం తియ్యని మకరందం వీనులకు విందుభోజనం కవిత్వం అనుభూతుల అక్షరాకారం అంతరంగాల ప్రతిస్పందనం కవిత్వం అందాల ప్రదర్శనం ఆనందాల కారకం…

‌పొదుపు

కూడికలు తీసివేతలు కాదు జీవితం అంటే భాగహారాలు గుణకారాలు కూడా ఉంటాయి ఏటిలో పుణ్యం కొరకు వేసె డబ్బును లెక్కపెట్టి పెద్దలు వేయ మన్నారు పుట్టుక నుండి చచ్చేదాక లెక్కాపత్రం ఉంటుంది లెక్కల్లో జాతక చక్రం ముడిపడి ఉంటుంది… నీరున్న తొట్టిలో నీరున్నంత వరకు తొట్టి కలకల లాడుతుంది నీరు తోడతుండాలి నింపుతు ఉండాలి అలానే…

‌జీవమున్న జ్ఞాపకం

మౌనమంటించిన మనసుచితిలో ఒక్క నిప్పురవ్వ బతుకులో రాలి గాలి కెరటాలకు పగటి లోతుకు చేరి కరిగిన క్షణాలది అక్షరాలా మరణమే. జీవమున్న జ్ఞాపకమే. నిలువెత్తు నిజాన్ని మింగేసిన ఆకాశంలో మిగిలిన శూన్యంతో పోరాడిన ప్రాణం గెలుచిన కన్నీళ్ళ ఈతకు ఊహకందడం లేదు ఒడ్డు. – చందలూరి నారాయ

దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్‌ ‌లే!!

స్విట్జర్లాండ్‌ ‌లోని దావోస్‌ ‌లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

ఖమ్మం రైల్వే స్టేషన్‌ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్‌ ఒక రోజు హైదరాబాద్‌ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్‌ అనే మా మిత్ర ఇంజినీర్‌ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ ‘మద్రాస్‌…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

45 సంవత్సరాల క్రితం 1977నుండి 79 వరకు సుమారు రెండున్నర సంవత్సరాలు నేనున్నప్పటి పాల్వంచ గ్రామం గురించీ, అక్కడి నా అనుభవాల గురించీ తెలిపే ముందు నేను అక్కడికి చేరుకున్న కారణం ముందుగా తెలుపుతాను. 1976 లో బీ ఎచ్‌ ఇ ఎల్‌ (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌) హైదరాబాద్‌ వారు సికిందరాబాద్‌ లోని మనోహర్‌ టాకీసు…