‘‘ఉరి’’శాశ్వత పరిష్కారమా !?
మానవ మృగానికి ఉరి శిక్ష పడిందని న్యాయమే గెలిచిందని సర్వత్రా కేరింతల జల్లు పత్రికల్లో పతాక టైటిళ్లు టివిల్లో ఠీవీగా ముచ్చట్లు వ్యాట్సప్ ఫెస్ బుక్కుల్లో విషెస్ పోస్టుల పరవళ్లు ఇంకొద్ది గడియల్లోనే సద్దుమనుగు సందళ్ళు అటుపై శరా మాములు రేపు మరో ‘‘రేప్’’ అదేవిధం సజీవ దహనం యధాతధం…
