Category శీర్షికలు

కాంక్ష

ఏదో జరిగింది నా మనసుకు కుదుట పడతలేదు కుదురుగా కూర్చొనిస్తలేదు సముద్రపు అలలు తీరాన్ని తాకిన స్థిరంగా ఉండనట్టు నా మనసు కుదుట పడతలేదు కుదురుగా కూర్చొనిస్తలేదు మారణ ఆయుధాలు ఆటంబాంబులు గడియ గడియకు అడుగు అడుగున పడుతుంటే శివుడు మూడో కన్ను తెరుస్తున్నాడా నా మనసు కుదుట పడతలేదు కుదురుగా కూర్చొనిస్తలేదు మూడడుగుల నేల కోసం ముల్లోకాలను ఆక్రమించిన వామననుడిలాగా…

విజేత నేనే

నా తప్పుకు నిజమనే సర్టిఫికెట్ ఇచ్చే పెద్ద మనసు ఏ రోజుకు ఉంటుందో అప్పుడు నేను అబద్దం కాదనీ నమ్మే రాత్రి నాకు బానిస అందాక నా తప్పు పక్షాన చేసే యుద్ధంలో అనుభవమే సాయుధబలంగా శత్రువు కనుచూపు మేరలో కనిపించదు అప్పుడు పట్టే నిద్రలో నా కలపై ఎవరి సంతకం ఉంటుందో అది ఓ…

మేలుకోనంత కాలం

దేశమంతటా కులం కంపు, మతం రొచ్చు మూఢనమ్మకాల మురికికాలువలో విచ్చలవిడిగా దొర్లుతోందీ దేశం మానవతా వస్త్రాలను విప్పేసుకొని అమానవీయతను అంటించుకొని ఊరేగుతోందీ దేశం ఓ వైపు విషంలా వ్యాపిస్తున్నది కులమతాల పిచ్చి పేట్రేగిపోతున్నది ఉన్మాదం మరోవైపు మనమేమో ఉగాది ఉత్సవాలంటున్నాం ప్రభుత్వాలేమో ఊదరగొట్టు ఉపన్యాసాలిస్తున్నాయి మామిడి పిందెల్ని కాదు పొత్తికడుపులోనే కరిగిపోతున్న పిండాల్ని చూడండి కోకిల…

భర్తలూ భార్యలూ!

మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు ఎవరైనా అన్నం తినేటప్పుడు కూరలు నంచుకుంటారు, యీ పిల్లలు మాత్రం కథలు నంచుకుంటారు. ఊకొడుతూ వదలకుండా తినేస్తారు. రోజూ మా అత్తయ్య మనవల్ని కూర్చోపెట్టుకొని బానే కథలు చెపుతుంది. ‘రాజుగారికి యిద్దరు భార్యలు. ఒక భార్యకి వొక వెంట్రుకా- రెండో భార్యకు రెండు వెంట్రుకలు…’ కథవిని పిల్లలు నవ్వుతూ ఆలోచనల్లో…

బాధకు అర్థం చెప్పే ‘అనిమేష’

చెమ్మ:   – వారాల ఆనంద్ నందిని సిధారెడ్డి తెలంగాణ నేలలో పుటిన కవి. అదే నేల శ్వాసను అక్షరాల్లో నింపిన కవి కూడా. ఆయన కవిత్వం ఆ  ప్రాంతపు చరిత్ర, అక్కడి ప్రజల సంఘర్షణకు ప్రతిధ్వనీ ప్రతిబింబం. పల్లె జీవితం, రైతు బాట, దుమ్ము, దూళి చెరువు, బీడు ఇవన్నీ ఆయన పొందిన బాల్యానుభవాలే కాదు, ఆ తర్వాతి కాలంలో ఆయన కవిత్వానికి మూలాధారాలు కూడా అయ్యాయి. యువకుడిగా ఉన్నప్పుడే కవిత్వం వైపు ఆకర్షితుడయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కవిత్వం కేవలం పుస్తకాల నుంచి…

ఒక నిస్సహాయ గానం

పలకరించే పక్షులు పచ్చని చెట్లు అలాయ్ బలాయ్ అరుచుకునే ముచ్చట్లు అన్నీ కరువై ఊరుమ్మడి బతుకుల్లో కలహభోజనుల మందెక్కిన సందడి అసలు కాకులే కరువైనని ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద ఎక్కడ వాలుతుంది కనుక పక్షుల సంగీత కచేరీలో సైతం శృతి లేని తీరొక్క తీరు గాత్రo మన తత్వం మరిచి మనస్తత్వం చంపుకొని…

నేను రైటర్స్ మీట్ ప్రొడక్ట్ -కరుణ కుమార్

తొలిసారి రైటర్స్ మీట్ కు 2017 లో ఒక విద్యార్థిగా, పాఠకుడిగా హాజరయ్యాను. సూర్యలంకలో జరిగిన ఆ మీట్ నా జీవితంలో గొప్ప మలుపు. గొప్ప గొప్ప కథకులను దగ్గరగా చూసే, వినే అదృష్టం, నేర్చుకునే వీలుతో పాటు సాహిత్యంలో స్నేహితులను సంపాదించుకోగలిగాను. ఆ ఉత్సాహంతో రాసిన మొదటి కథ చున్నీ. అక్కడినుండి ఈరోజు వరకు…

నా అదృష్టంగా భావిస్తున్నాను

తెలుగు సాహిత్యరంగంలో ‘రైటర్స్ మీట్‘ అగ్రశ్రేణి రచయితల నుండి వర్ధమాన రచయితల వరకు అందరినీ ఏకం చేసే అద్భుతమైన వేదిక. రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఎనిమిదేళ్ళుగా కోర్ టీమ్ సభ్యురాలిగా ఈ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి ఇన్ ఫార్మల్ చర్చలు, సీనియర్ల అనుభవాలు, నవతరం ఆలోచనలు నాలో విస్తృతమైన మార్పును…

ఒక బంధానికి సిల్వర్ జూబ్లీ

ఒక బాంధవ్యానికి పాతికేళ్ళు. తెలుగు కథాపరిణామక్రమాన్ని దఖలు చేస్తుంది ఇదంతా. తెలుగు నేలలో ట్యాంక్ బండ్ తడి గడ్డి పరకలపైన, హైదరాబాద్ పాత చలిలా మొలకరించింది, చిలకరించింది, అవతరించింది రైటర్స్ మీట్. తెలుగు కథ విస్తరించడంలో విస్తరాకులు కుట్టింది, తోరణాలు కట్టింది, దీపధారులను అక్కున చేర్చుకొని కాగడాలకు తైలం దిద్దింది. జ్యోతి రగిల్చింది. కథా రచన…