కడ్తాల్ – షాద్ నగర్ రహదారిపై కారు దగ్ధం
ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలోని మక్తమాదారం ప్రధాన రహదారిపై ఓ కారు షాట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతి అయింది. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండా కు చెందిన నలుగురు యువకులు ఆల్టో కారులో హైదరాబాద్ వెళుతుండగా కడ్తాల – షాద్ నగర్ ప్రధాన రహదారిపై నడుస్తున్న కారులో పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ కారుని ఆపారు. కారులో ఉన్న నలుగురు యువకులు కిందకు దిగారు. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.





