– హైదరాబాద్ వాసి దుర్మరణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7 శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ ఉద్యోగి అశోక్ మృతిచెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ పెరుంబవూర్ రోడ్డులోని త్రిక్కలత్తూర్, కవుంపాడు వద్ద ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన కొడుకు, అల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అల్లుడి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు..సమాచారం అందుకున్న వెంటనే మువత్తుపుళ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదే ప్రాంతంలో నెల క్రితం అయ్యప్ప భక్తుల బస్సు, లారీ ఢీకొన్న ఘటన జరిగింది. ఆ సమయంలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



