కేబినేట్‌ ‌భేటీ వాయిదా

– 28న జరపాలని సిఎం నిర్ణయం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగాల్సిన కేబినెట్‌ ‌భేటీ వాయిదా పడింది.  ఐదుగురు మంత్రులు దిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మంత్రులు.. పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, వాకిటి శ్రీహరి.. దిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించి వారు కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌సూచన మేరకు దిల్లీకి వెళ్లారు. ఇతర ఇద్దరు కీలక మంత్రులు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కూడా ప్రస్తుతం దిల్లీలోనే ఉన్నారు. దీంతో శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. దుగురు మంత్రులు దిల్లీలోనే ఉండటంతో క్యాబినెట్‌ ‌సమావేశం వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్‌ ‌భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *