2047 నాటికీ త్రి ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మి గా తెలంగాణ

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థ‌ల స‌హ‌కారంతో  డాక్యూమెంట్ రూపకల్పన
రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతుల‌ను భాగ‌స్వాములను చేస్తాం
అంత‌ర్జాతీయ విద్యా సంస్థ‌ల‌ను రాష్ట్రానికి ర‌ప్పించి నాలెడ్జ్ హ‌బ్ గా రాష్ట్రం
విదేశాల నుంచి నేరుగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నాం
తెలంగాణ ప్ర‌భుత్వం గత అనుభ‌వాల నుంచి నేర్చుకున్న పాఠాల‌ను భ‌విష్య‌త్తు త‌రాల కోసం పాల‌సీ డాక్యూమెంట్ గా జాతికి అంకితం ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ఆదివారం సెక్రటేరియట్ లో తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ , తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష లో  ముఖ్యమంత్రి  ప్ర‌పంచ దేశాల్లో ఉన్న దిగ్గ‌జ కంపెనీల‌ను మ‌న యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించి తద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాం…అని పేర్కొంటూ” విజ‌న్ డాక్యుమెంట్ ను తెలంగాణ రైజింగ్ 2047 గా పిలుస్తున్నాం.. విజ‌న్, స్టాట‌జీ .. రెండు అంశాలు ఇందులో ఉంటాయి.. విజ‌న్ డాక్యూమెంట్ లో ల‌క్ష‌లాది మంది భాగ‌స్వాముల‌ను చేస్తున్నాం.. నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థ‌ల స‌హ‌కారంతో  డాక్యూమెంట్ ను త‌యారు చేస్తున్నాం.. ప్ర‌తి అంశాన్ని లోతుగా విశ్లేషించి భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటున్నాం.. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభ‌జించాం.. అవుట‌ర్ రింగ్ రోడ్డు లోప‌లి ప్రాంతాన్ని మొత్తం ప్ర‌ణాళిక బ‌ద్ద‌మైనఅభివృద్ది కోసం కోర్ అర్భ‌న్ రీజ‌న్ ఎకాన‌మి గా చూస్తున్నాం.. కాలుష్య ర‌హిత సిటీ గా మార్చ‌డం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాం.. మెట్రోపాలిట‌న్ సిటీలు  ప్ర‌స్తుతం కాలుష్య‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి..
కోర్ అర్భ‌న్ రీజ‌న్ ను స‌ర్వీస్ సెక్ట‌ర్ గా మారుస్తున్నాం.. కాలుష్యాన్ని వెద‌జ‌ల్లే పరిశ్ర‌మ‌ల‌ను కోర్ అర్భ‌న్ రీజ‌న్ నుంచి త‌ర‌లిస్తున్నాం.. కోర్ అర్భ‌న్ రీజ‌న్ లో మూసీ ప్ర‌క్షాళ‌న‌, మెట్రో విస్త‌ర‌ణ వంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం..అవుట‌ర్ రింగ్ అవ‌త‌లి భాగంలో రీజ‌నల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయి..రీజ‌న‌ల్ రింగ్ రోడ్లు 360 కిలోమీట‌ర్ల దూరం ఉండనుంది..పెరీ అర్భ‌న్ రీజ‌న‌ల్ ఎకాన‌మి గా దీన్ని పిలుస్తాం..భార‌త్ ప్యూచ‌ర్ సీటీ తో పాటు అనేకం ఈ రీజ‌నల్ లో ఉండ‌బోతున్నాయి.. గ్రీన్ ఫీల్డ్ హై వే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్క‌డ రాబోతున్నాయి… మ‌చిలీప‌ట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకువస్తున్నాం..తెలంగాణ లో ఇంకా ఎయిర్ పోర్టులు రావాల్సి ఉంది.. వ‌రంగ‌ల్ ,ఆదిలాబాద్, కొత్త‌గూడెం, రామగుండం లో ఎయిర్ పోర్టులు తీసుకురాబోతున్నాం.. హైవే,పోర్ట్, ఎయిర్ పోర్టు క‌నెక్టివిటి వ‌ల్ల  పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చి తెలంగాణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాం..రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు మూడో రీజియన్ గా చూస్తున్నాం.,వ్య‌వ‌సాయ ఆధారిత ఉత్ప‌త్తుల‌ను నిర్ల‌క్ష్యం చేయం.. రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతుల‌ను భాగ‌స్వాములను చేస్తాం..తెలంగాణ భూములు విత్త‌నాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి బాగా అనుకూలం.. క్యూర్, ప్యూర్ ,రేర్ లా తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తున్నాం.. ఈ మూడింటిని క్రోడిక‌రించి తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యూమెంట్ ఉండ‌బోతుంది.. తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల‌ను ద్రుష్టిలో ఉంచుకుని అభివ్రుద్ది ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం.. దేశానికి అవ‌స‌రం అయిన దానికంటే అహార‌ధాన్యాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నాం.. కాని న్యూట్రిష‌న్ పుడ్ ఇవ్వ‌లేక‌పోతున్నాం.. అంద‌రికి విద్య అందుబాటులో ఉన్న‌ప్ప‌టికి నాణ్య‌మైన విద్య , సాంకేతిక విధ్య అందుబాటులో లేదు.. అంత‌ర్జాతీయ విద్యా సంస్థ‌ల‌ను రాష్ట్రానికి ర‌ప్పించి నాలెడ్జ్ హ‌బ్ ను క్రియేట్ చేస్తాం..2034 కి వ‌న్ ట్రిలియ‌న్ ,2047 త్రి ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మి గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం…దేశంలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నాం.. మా దార్శ‌నిక‌త‌నే మా భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు.. తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ సమ్మిట్ కు అనేక మంది ప్ర‌ముఖుల‌ను ఆహ్వానిస్తున్నాం.. ప్ర‌జాభ‌వ‌న్ లో డిప్యూటీ సీఎం భ‌ట్టి ఆధ్వ‌ర్యంలో వార్ రూం ఏర్పాటు చేశాం.. చైనా, జ‌పాన్ , సౌత్ కొరియా, సింగ‌పూర్ మాకు రోల్ మోడల్.. వాళ్ల‌నే ఆద‌ర్శంగా తీసుకుని పోటీ ప‌డ‌తాం..ఆంధ్రా, త‌మిళ‌నాడు ,మ‌రో రాష్ట్రం మాకు పోటీ కాదు..విదేశాల నుంచి నేరుగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నాం అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,దామోదర రాజనర్సింహ,కొండా సురేఖ,జూపల్లి కృష్ణా రావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,అడ్లూరి లక్ష్మణ్,అజారుద్దీన్,వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నా రెడ్డి,ప్రభుత్వ సలహాదారులు కే కేశవ రావు,సుదర్శన్ రెడ్డి,షబ్బీర్ అలీ.పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *