– సెలవు రోజుల్లో కూల్చొద్దని హైకోర్టు చెప్పినా వినని సీఎం
– కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే
ౖ- జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఆదివారం కోర్టు సెలవు చూసుకుని మరీ గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేశారు.. అలాగే రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి బుల్డోజర్‌తో వస్తారు.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఇళ్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్లే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ ప్రెసిడెంట కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారని, కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది.. రెండేళ్లల్లో చేసిందేమీ లేదు.. బుల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు మంత్రులు పొంగులేటి, వివేక్ వంటి వారు ప్రభుత్వ స్థలాల్లో, చెరువులపైన ఇళ్లు కట్టినా వాటిని కూల్చివేయలేదు.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ చెరువులోనే పెద్ద నేతలు, మంత్రి వివేక్, కేవీపీ రామచంద్ర రావు, మంత్రి పొంగులేటి ఇళ్లు ఉన్నప్పటికీ వాటిని కూల్చరు.. ఆదివారం, శనివారం వస్తేనే పేదల ఇళ్లు బుల్డోజర్లతో కూలుస్తున్నారు అని ఆరోపించారు. హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేశాం.. 42 ఫ్లైఓవర్లు కట్టినం.. రాహుల్ గాంధీకి ఇవి కనపడవు అని అన్నారు. రేవంత్ రెడ్డి జెండా కాంగ్రెస్.. ఎజెండా బీజేపీది.. బుల్డోజర్లను అక్కడ వ్యతిరేకిస్తూ ఇక్కడేమో అదే బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారు అని ఆయన విమరిÊశంచారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనన్నారు. హిందువులు, ముస్లింలు అని మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, పదేళ్లు కేసీఆర్ పాలనలో ఒక్క పంచాయితీ కూడా కాలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అని ప్రశ్నించారు. పదేళ్లు జోరుగా నడిచిన పాలన ఇప్పుడు ఆగం అయిందన్నారు. కేసీఆర్ లక్ష ఇస్తే తాము తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా అంటూ అప్పు పుట్టట్లేదు అని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంతమంది సీఎంలను చూశాం కానీ ఇతనిలాగా ఏ ముఖ్యమంత్రీ మాట్లాడలేదన్నారు. హామీలు అమలు చేయండి అని అడిగితే నన్ను కోసుకు తింటారా అని అంటున్నారు. నిజాయతీ ఉన్న ముఖ్యమంత్రి ఇలా అంటారా అని నిలదీశారు. కరోనా టైమ్‌లోనూ ఏ పథకం ఆపలేదు. అన్నీ మనం కట్టిన వాటిని ప్రారంభిస్తున్నారు.. మనం కట్టిన ఫ్లైఓవర్లకు సున్నం వేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లో గుద్దితే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. అడ్డంగా సంపాదించిన డబ్బులు రేవంత్ దగ్గర, కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్నాయి. ప్రజల్లో కోపం ఉంది. గతంలో 4,700 మెజారిటీ వచ్చింది, ఈసారి 10 వేలు దాటాలి అని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో ఉచిత మంచి నీళ్లు ఆపేస్తాడు. అందుకే జూబ్లీహిల్స్, జీహెచ్‌ఎంసీ ఈ రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలి అని కోరారు. నిన్న మోదీ వచ్చి ఏదో చెప్తాడు అనుకున్నాం.. హెచ్-1బీ గురించి మాట్లాడుతాడు అనుకున్నాం. జీఎస్టీ పండగ చేసుకో అని చెప్తున్నారు. మొన్నటిదాకా రక్తం తాగి ఇప్పుడు తగ్గించి పండగ చేసుకో అంటున్నారు అని విమరిÊశంచారు. గ్యాస్ ధర నాడు రూ.450 ఉంది, ఇప్పుడు వెయ్యి దాటిందన్నారు. ముడి చమురు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదన్నారు. ఎలా పండగ చేసుకోవాలి అని మోదీని ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని అడిగారు. జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తున్నదని, మీరు తప్పిదారి పట్టి కాంగ్రెసనకు ఓటు వేయొద్దు.. కాంగ్రెస్ వాళ్లను ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి అని కేటీఆరన విజÊఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





