సింగరేణి జాగృతి ఆవిర్భావం -మంగ‌ళ‌వారం ప్రారంభించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌

సింగ‌రేణి కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత నాయ క‌త్వంలో మంగ‌ళ‌వారం సింగ‌రేణి జాగృతి ఆవిర్భ‌వించింది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ టీబీజేకేఎస్‌తో ఇది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇందులో ప్ర‌ధానంగా బ‌హుజ‌నులు, యువ‌కుల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు.

సింగ‌రేణిలోని 11 ఏరియాల‌కు కోఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు జ‌రిగింద‌ని ఆమె వివ‌రించారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్ట‌నున్న‌ట్టు తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతితో ఈ సంస్థ‌ను అంతం చేయ‌డానికి కృషిచేస్తున్న నేప‌థ్యంలో దీని్న కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై వున్న‌ద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నార‌ని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేద‌ని గుర్తుచేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *