మహిళలకు వడ్డీలు చెల్లించని బీఆర్ఎస్ సర్కార్

– అసెంబ్లీలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో తాము పనిచేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణాలు ఇప్పించామని, రుణాలకు సంబంధించి రూ.1390 కోట్లు ఇప్పటివరకు వడ్డీలు చెల్లించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసంతో బతికే మహిళలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడమే బీఆరఎస్ పనిగా పెట్టుకుందని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏం చేసింది అని ప్ర‌శ్నించారు. రూ.3000 కోట్ల వడ్డీలను మహిళలపై భారం మోపి వారికి చెల్లించకుండా మోసం చేసిందని, ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసి ఆదా చేసుకున్న అభ్యాస నిధులను గత ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. మీ పదవీ కాలంలో ఏకకాలంలో రుణ మాఫీ చేస్తామన్నారు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు కట్టించలేదని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలపై నిష్ఠూరాలు ఎందుకు.. తమ ప్రభుత్వంపై మాట్లాడే ముందు మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారో సమాధానం చెప్పాలి అని సీతక్క నిలదీశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *