-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ధాన్యం కొనుగోలు అంశంలో బి.ఆర్.ఎస్ అసత్యప్రచారనికి పూనుకుని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రబీ సీజన్ లో గురువారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన గణాంకాలతో వెల్లడించారు. అదే బి.ఆర్ ఎస్ పాలన లో అంటే 2022-23 రబీ సీజన్ లో మే 22 నాటికి కొనుగోలు చేసింది కేవలం 36.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నని ఆయన గుర్తు చేశారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో సాగయిన చివరి రబీ సీజన్ లో నాటి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో పోల్చి చూస్తే ప్రస్తుత ప్రభుత్వం రబీ సీజన్లో అదే మే 22 నాటికి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసిందన్నారు.
ఈ గణాంకాలే బి.ఆర్.ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిదర్శనమన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న రైతాంగ అనుకూల విధానాలతో అటు ఖరీఫ్ ఇటు రబీ లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ధాన్యం అధిక దిగుబడిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను పెద్ద సంఖ్యలో పెంచామని ఆయన తెలిపారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే