బిఆర్‌ఎస్‌వి తప్పుడు ప్రచారాలు

– మండిపడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5:‌జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తనపై బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు తనపై తప్పుడు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ‌ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉన్నానని, గతంలో ఓటమి చెందినా ప్రజలతో మమేకం అయ్యానని నవీన్‌ ‌యాదవ్‌ ‌చెప్పారు. తాను చదువుకున్న వ్యక్తినని, ప్రజల కోసం నిజాయ‌తీగా పనిచేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గతంలో తమ గల్లీకి ఎమ్మెల్యే కూడా రాలేదని, ఇప్పుడు సీఎం వస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను కుడి భుజంగా భావించడం తమ అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి గతంలో కేసీఆర్‌కు సహాయం చేశారన్న నవీన్‌ ‌యాదవ్‌, ‌కేసీఆర్‌ ‌తమ ఇంటికి వచ్చి సహాయం అడిగారని, శత్రువు ఇంటికి వచ్చినా సహాయం చేస్తామని నవీన్‌ ‌యాదవ్‌ అన్నారు. 2018లో తనకు అవకాశం ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుకుందని విమర్శించారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, బీఆర్‌ఎస్‌ ‌చేసిన అభివృద్ధి ఆధారంగా వోట్లు అడగాలని ఆయన సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *