‌రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్‌ ‌కుట్ర

తప్పు చేసి గొప్ప పనిలా మాట్లాడుతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు అధికారం కోల్పోతే అమాయకులను బలిచేస్తారా..
•కేటీఆర్‌ ‌దిల్లీ ఎందుకు వెళ్ళావ్‌? ఎవరిని కలిసావ్‌? మహారాష్ట్ర ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఎం‌దుకు పోటీ చేయడం లేదు?
•గవర్నర్‌ ‌మీద నమ్మకం ఉంది, చట్టం ప్రకారం ముందుకెళ్తాం లగచర్ల రైతులకు మంచి ప్యాకేజితో పాటు యువతకు ఉద్యోగాలు
•అధికారులు భయపడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క

హిమాయత్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగం కూడా అభివృద్ది అవసరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాడమే కాకుండా ప్రవేట్‌ ‌రంగంలో కూడా ఉద్యోగాలివ్వాలనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కుట్రపూరితంగా కావాలనే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. లగచర్లలో కావాలనే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ జిల్లా కలెక్టర్‌ ‌పై అక్కడున్న అధికారులపై ముందస్తు ప్లాన్‌ ‌ప్రకారమే అక్కడి గిరిజనులను రెచ్చగొట్టి ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు ప్రజల్లో భావన తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారన్నారు. లగచర్ల గ్రామంలో భూములు కోల్పోయే వారికి ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇచ్చి అక్కడ వచ్చే పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుందన్నారు. హైదరాబాద్‌ ‌లోనే కాక గ్రామాల్లో కూడా అభివృద్ధి కావాలని గ్రామాలకు ఫ్యాక్టరీలను విస్తరించడం ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. అమాయకులను రెచ్చగొట్టి జిల్లా కలెక్టరు (మెజిస్ట్రేట్‌) ‌పైన దాడులు చేపించారంటే బీఆర్‌ఎస్‌ ఏం ‌చెప్పాలనుకుంటోందని ప్రశ్నించారు.

చట్టాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు. బిఆర్‌ఎస్‌ ‌నాయకులు తప్పు చేసి గొప్ప పనిలా మాట్లాడుతున్నారని అన్నారు. పదేళ్లు పని చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ను నేను అడుగుతున్నా..  ఇది కరెక్టా? బయటికి వొచ్చి మాట్లాడు కేసీఆర్‌? అని సవాల్‌ ‌విసిరారు. కెసిఆర్‌ ఈ ‌విషయంపై స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు. అధికారులు ఎవరూ భయపడవొద్దని, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. మీరు అధికారం కోల్పోతే అమాయకులను బలి చేస్తారా? అని బిఆర్‌ఎస్‌ ‌నాయకులను ప్రశ్నించారు. ఆనాడు ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టి ప్రాణాలు తీసుకొనేలా చేశారు, ఈనాడు ఉద్యోగాలు కోల్పోగానే అమాయకులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. దాడి వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా ఊరుకునేది లేదన్నారు. ఉద్యోగ నియామకాలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. అభివృద్ధి ఒక దగ్గర ఉండకూడదు..

అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసిందని అన్నారు. కాల్‌ ‌డేటా తీయగానే కేటీఆర్‌ ఉన్నాడా, కెసిఆర్‌ ఉన్నాడా అని తెలుస్తాయన్నారు. గతంలో చాలాసార్లు భూ సేకరణ జరిగింది, కానీ ఎప్పుడైనా అధికార్లు మీద దాడి జరిగిందా అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలు ఒక దగ్గర ఉండకూడదనే క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చెందని ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నెలకొల్పుతున్నామని తెలిపారు. కేటీఆర్‌ ‌దిల్లీ ఎందుకు వెళ్ళావ్‌? ఎవరిని కలిసావ్‌? ‌నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వెళ్లావ్‌? ‌గవర్నర్‌ ‌దగ్గర ఫైల్‌ ఉం‌ది, దిల్లీలో మాట్లాడుకుంటున్నావా కేటీఆర్‌? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయటం లేదు? కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓటు వెయ్యొద్దు అంటే బిజెపి ఓటు వేయమని చెప్తున్నావ్‌ ‌కదా అని అన్నారు. మాకు గవర్నర్‌ ‌మీద సంపూర్ణ నమ్మకం ఉంది, చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *