కురుమల సాహిత్యం- చరిత్ర -సంస్కృతి  పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ‌

– అద్భుత ప‌రిశోధ‌న గ్రంథం

– ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 25:  సాంస్కృతిక మూలాలను వెలికి తీసిన అద్భుత ప‌రిశోధ‌న గ్రంథం “కురుమల సాహిత్యం చరిత్ర సంస్కృతి”  అని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. డా. బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్  యూనివర్సిటీలో శ‌నివారం నిర్వహించిన ఛాయ సాహిత్యోత్సవంలో బర్ల మహేందర్ రాసిన “కురుమల సాహిత్యం- చరిత్ర -సంస్కృతి” పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెస‌ర్‌ సూర్య ధనంజయ్ మాట్లాడుతూ కురుమల సాంస్కృతిక చరిత్రను ముందు తరాలకు అందించే పరిశోధన గ్రంథం ఇది అన్నారు. ఆచార్య ఎన్.రజని మాట్లాడుతూ ప్రజలందరూ చదవాల్సిన చరిత్ర అన్నారు. ఈ కార్యక్రమానికి కె. ఆనందాచారి అధ్యక్షత వహించారు. ఆచార్య పుష్పా చక్రపాణి , అల్లం నారాయణ, కె.శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, బర్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *