– పర్మినెంట్ ఉద్యోగులకు రూ.1,95,610లు
– కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500
– కోల్పోయిన రెండు బ్లాకులు సింగరేణిలోకి తెచ్చేందుకు యత్నం
– క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లోకి సింగరేణి ప్రవేశం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు రూ.819 కోట్లు దసరా బోనస్‌గా ప్రకటిస్తున్నామని, ఇందులో 41 వేల పర్మినెంట్ కార్మికులు ఒక్కొక్కరికి రూ.1,95,610లు, 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5500 చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వికమ్రార్క చెప్పారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటాను సీఎంతో కలిసి ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లించిన చరిత్ర లేదన్నారు. పన్నులు పోగా సింగరేణికి వచ్చిన లాభం రూ.6,394 కోట్లు అని ఇందులో సింగరేణి విస్తరణకుగాను రూ.4034 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామని వివరించారు. నికరం లాభం రూ.2,360 కోట్లు కాగా ఇందులో 34 శాతాన్ని కార్మికులకు దసరా బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సింగరేణి తెలంగాణకు ఆత్మ వంటిదని, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పెడితే గత ప్రభుత్వం పాల్గొనలేదని, ఫలితంగా రెండు బొగ్గు గనులు ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులకు వెళ్లాయని ఆయన దుయ్యబట్టారు. ఆ రెండు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లడంతో సింగరేణికి నష్టం చేకూరిందన్నారు. ఆ గనుల్లో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయంటూ ప్రైవేటు వ్యక్తులకు వెళ్లిన వాటిని తిరిగి తెచ్చుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఒక్క బొగ్గు మైనింగ్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ రంగంలో మైనింగ్‌పై దృష్టి పెట్టామని కూడా భట్టి తెలిపారు. సింగరేణికున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మైనింగ్ రంగంలో విస్తృతంగా వెళ్లాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. కర్ణాటకలో కాపర్, గోల్డ్ మైనింగ్ సంబంధించి టెండర్లు పిలవగా సింగరేణి సంస్థ దక్కించుకుందని, ఆ గనుల్లో అన్వేషించి తవ్వకాలు చేపట్టి వాస్తవ నిలువలు గుర్తిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఈ మైన్స్‌ను దక్కించుకున్న వారు గని జీవితకాలం 35 రాయల్టీ సింగరేణి సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది సింగరేణిని విస్తరించేందుకు %ూఔజ% ప్రైస్ వాటర్ కూపర్, కేపీఎంజీ వంటి సంస్థలను కన్సల్టెన్సీలుగా పెట్టుకున్నాం.. భవిష్యత్తులో సింగరేణి జెండాను రెపరెపలాడించి తలమానికంగా నిలబెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన.. సింగరేణి తల్లి లాంటిది.. అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సింగరేణి సీఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





