ాహైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం జరిగిన ఆషాఢ మాసం బోనాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టరు వి.నరసింహాచార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శాసనసభ ఆవరణలో బోనాలు



